Bomb Threat: తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు..

తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా ఏ వస్తువు బయటపడలేదు. చివరికి ఇది బూటకమని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

New Update
TAJ Mahal

ప్రపంచ వింతల్లో ఏడో వింతైన అద్భుతమైన కట్టడం తాజ్‌మహల్ అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. చివరికి ఇది అబద్ధమని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం గుర్తు తెలియని అకౌండ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది.

Also Read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?

అందులో తాజ్‌మాహల్‌ను పేల్చేస్తామంటూ చెప్పారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో బాంబు స్వ్కాడ్‌, డాగ్‌స్క్వాడ్, ఇతర బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. కానీ అక్కడ అనుమానస్పద వస్తువులు ఏమీ కూడా కనపించలేవు. దీంతో తాజ్‌మహల్ చుట్టూ మరింత భద్రతను పెంచినట్లు ఏసీబీ సయూద్ అరీబ్‌ అహ్మద్‌ మీడియాకు వెల్లడించారు.  

Also Read: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. మెయిల్ వచ్చిన వెంటనే ఆగ్రా పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వాత్స పేర్కొన్నారు.

Also Read: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి

 ఇదిలాఉండగా ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపుల రావడం కామన్ అయిపోయింది. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అనేక ప్రాంతాల్లో బాంబు దాడులు జరగనున్నాయనే బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు కేటుగాళ్లు కావాలనే ఇలాంటి పనులకు పాల్పడుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు.  

Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస

Advertisment
తాజా కథనాలు