Mahrarashtra Civic Polls: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం.. సిరాకు బదులు మార్కర్‌ పెన్నులు

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వాళ్ల చేతివెలికి వేసే సిరాకు బదులుగా మార్కర్‌ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.

New Update
BMC rejects reports claiming indelible ink marks being wiped off voters’ hands

BMC rejects reports claiming indelible ink marks being wiped off voters’ hands

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వాళ్ల చేతివెలికి వేసే సిరాకు బదులుగా మార్కర్‌ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పెద్దఎత్తున వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడేందుకే అధికారులు ఈ విధానాన్ని పాటిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. బృహన్ముంబయి మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని సైతం ఓటర్ల చేతివెలికి మార్కర్‌ పెన్ను వినియోగించినట్లు అంగీకరించారని ఆరోపించాయి. 

Also Read: రెచ్చిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..ఢిల్లీ, కెనడాల్లో వరుస కాల్పులు

ఈ వ్యవహారంపై మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (MNS) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధానాన్ని తారుమారు చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు. వాళ్లు ఎలాంటి అవకతవకలైనా చేయగలరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: అణ్వాయుధాలను దాచిన ఇరాన్..ఆ ధైర్యంతోనే అమెరికాకు సవాల్

మరోవైపు ఈ ఆరోపణలను బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఖండించింది. ఈ ఎన్నికల్లో సిరాకు బదులు మార్కర్ పెన్నులు వాడారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై  మున్సిపల్‌ కమిషనర్ భూషణ్ గగ్రాని ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించింది. 

Advertisment
తాజా కథనాలు