/rtv/media/media_files/2025/02/05/Bo2uzbfwYHbwd1A4Nto3.jpg)
BJP and AAP
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 70 సీట్లకు గానూ 48 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి పాలయ్యారు. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 36. దీంతో 48 సీట్లు సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది. ఈక్రమంలో గత ఎన్నికలకు ఇప్పటి వాటికి బేరీజు వేస్తే ఓట్ల వాటా లోనూ ఆప్ దాదాపు 10 శాతం కోల్పోయింది. మరో వైపు కాషాయ పార్టీ పుంజుకుని ఏడు శాతం ఓట్ల వాటాను పెంచుకుంది. ఈ ఎన్నికల్లో ఒక్కచోటా గెలుపొందని కాంగ్రెస్ ఓట్ షేరింగ్ సైతం రెండు శాతం మెరుగుపడింది.
Also Read: AP: ఢిల్లీకి, ఏపీకి పోలిక ఉంది..బీజేపీ చారిత్రాత్మక విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్
పది తగ్గింది...ఏడు పెరిగింది..
2015 ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ 54.5 శాతం ఓట్లు సాధించింది. 70 సీట్లలో ఏకంగా 67 స్థానాలను దక్కించుకుని మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ వాటా 53.57 శాతంగా ఉంది. అయితే ఈసారి మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల వాటాలో 10 శాతం కోల్పోయి 43.57 శాతానికి పడిపోయింది. మరోవైపు బీజేపీ 27 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకుంది కాషాయ పార్టీ. ఈ ఎన్నికల్లో 45.56 శాతం ఓట్లను సాధించింది. 2020లో దక్కించుకున్న 38.51 శాతంతో పోలిస్తే ఈ ఏడాది ఏడు శాతం మెరుగుపరుచుకుంది. 2015లో బీజేపీ ఓటు వాటా 32.03 శాతంగా ఉంది.
Also Read: Delhi Elections: తీర్పును గౌరవిస్తాం...పోరాటం కొనసాగిస్తాం..రాహుల్ గాంధీ
ఇది కూడా చదవండి: Dhruv Rathee: ఆప్ ఓటమిపై స్పందించిన ధ్రువ్ రాఠీ.. బీజేపీపై విమర్శలు