/rtv/media/media_files/2025/08/27/mp-2025-08-27-23-06-46.jpg)
MLA Narendra Singh Kushwaha
బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుశ్వాహా చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ కలెక్టర్ పై చేయి చేసుకోవడానికి వెళ్ళిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని భీండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎరువుల సమస్య పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్య నరేంద్ర రైతులతో కలిసి కలెక్టర్ ఇంటి ఎదురుగా నిరసనకు దిగారు. ఇది చూసిన కలెక్టర్ శ్రీ వాస్తవ ఇంటి గేటు మూసేయాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యేకు మధ్య వివాదం చోటు చేసుకుంది ఇది కాస్త ముదరడంతో ఆగ్రహానికి లోనైన నరేంద్ర కలెక్టర్ శ్రీ వాస్తవను కొట్టడానికి వెళ్ళారు. కానీ పక్కనున్న భద్రతా సిబ్బంది ఆపడంతో వెనక్కు తగ్గారు.
भिंड भाजपा विधायक नरेंद्र सिंह कुशवाहा कलेक्टर के बंगले में जाकर उन्हें घूसा दिखा रहें हैं @JSTomarAAP@AamAadmiParty@akshayhunkapic.twitter.com/zPazr1NT4d
— Pradeep Napit (@Pradeepnapit_) August 27, 2025
ఎరువుల సమస్యపై నిరసన..
ఈ గొడవ అయిన కాసేపటికి కలెక్టర్ శ్రీవాస్తవ వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుశ్వాహా మాత్రం ధర్నాకొనసాగించారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా భిండ్ జిల్లాలోని రైతులకు కేవలం రెండు బస్తాల ఎరువులు మాత్రమే లభిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేను చల్లబర్చడానికి ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం మాట వినలేదు. చివరకు ఇన్‌ఛార్జి మంత్రి ప్రహ్లాద్ పటేల్ జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే నిరసనను విరమించారు.
Also Read: BIG Breaking: అమెరికాలో కాల్పుల కలకలం..స్కూల్ పిల్లలపై షూటింగ్..ముగ్గురు మృతి