BIG Breaking: అమెరికాలో కాల్పుల కలకలం..స్కూల్ పిల్లలపై షూటింగ్..ముగ్గురు మృతి

అమెరికాలోని మినియాపోలిస్ లో ఓ స్కూల్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. పిల్లలపై కాల్పులు జరిపిన తరువాత దుండగుడు తనను తాను కూడా కాల్చుకున్నాడు.

New Update
us

Parents await news of their children after a reported mass shooting

అమెరికాలో ఈ మధ్య కాల్పులు మరీ ఎక్కువైపోతున్నాయి. ప్రతీ రెండు రోజులకోసారి ఎక్కడో ఓ చోట షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు మినియాపోలిస్ లో కాథలిక్ స్కూల్ లో కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో కాల్పుల జరిపిన వ్యక్తి కూడా ఉన్నాడు.  దుండగుడు చర్చి వెనుక నుంచి షూటింగ్ చేశాడు. ఇందులో 8, 10 ఏళ్ళు గల ఇద్దరు పిల్లలు మృత్యువాతన పడ్డారు. గాయపడిన మరి కొందరి పిల్లల పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాల్పుల జరిపిన వ్యక్తి దగ్గర ఒక రైఫిల్ తో పాటూ షాట్ గన్, పిస్టల్ కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దుండగుడు 22 ఏళ్ళ ట్రాన్స్ జెండర్ అని అధికారులు గుర్తించారు. కాల్పులకు ముందే దానికి సంబంధించి యూట్యూబ్ లో పోస్ట్ పెట్టినట్టు చెబుతున్నారు. అయితే కాల్పులు ఎందుకు చేశాడన్నది మాత్రం ఇంకా తెలియలేదు. 

ఐదుగురి పరిస్థితి విషమం..

మినియాపోలిస్ లో అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్ వేసవి సెలవుల తర్వాత మొదలై రెండు రోజులు మాత్రమే అయింది. ఇంతలో ఈ ఘటన జరిగింది. మిన్నెసోటా అధికారుల సమాచారం ప్రకారం గాయపడిన వారిలో ఐదుగురు పిల్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ట్వీట్ చేశారు. తాము పరిస్థితిని ఎప్పటికప్పుడు గమిస్తున్నామని తెలిపారు. పిల్లలు, టీచర్స్ క్షేమం గురించి ప్రార్థిస్తున్నానని అన్నారు.  ఉదయం స్కూల్లో విద్యార్థులను దింపే సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్ లో ప్రీ కిండర్ గార్డెన్ నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. మరోవైపు కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. వైట్ హౌస్ పరిస్థితిని సమీక్షిస్తోందని చెప్పారు. 

trump

Advertisment
తాజా కథనాలు