Rahul Gandhi: బిహార్‌ గూండాల రాజ్యంగా మారింది.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం

ఇప్పుడు బిహార్‌ దోపిడి, కాల్పులు, హత్యల నీడలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. నేరాలు అనేవి సాధారణం అయిపోయాయని విమర్శించారు. వీటిని నిర్మూలించడంలో నితీష్ కుమార్‌ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరులను రక్షించని పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఇలాంటి దారుణాలు, దోపిడీలను పూర్తిగా నిర్మూలించే సమయం వచ్చిందని తెలిపారు.  

Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

ఇదిలాఉండగా పట్నాలోని గాంధీ మైదాన్‌ ఠాణా పరిధిలో శుక్రవారం గోపాల్ ఖేమ్కా హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాత్రి 11.40 గంటలకు తన ఇంటికి చేరుకున్న ఆయన కారు దిగుతుండగా అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటన బిహార్‌ రాజకీయాల్లో సంచలనం రేపింది. దీనిపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ కూడా ధ్వజమెత్తారు. గోపాల్‌ ఖేమ్కాను దుండగులు పట్నా నడిబొడ్డున హత్య చేస్తే.. అక్కడి పోలీసులు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందని తెలిపారు. ఆరేళ్ల క్రితం కూడా ఆ వ్యాపారవేత్త కుమారుడిని ఇలానే హత్య చేశారని.. కానీ హంతకులను అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు