BIG BREAKING :  ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

ఫిడే మహిళల ప్రపంచకప్‌ 2025 విజేతగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై-బ్రేక్‌లలో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది.

New Update
divya-deshmukh

ఫిడే మహిళల ప్రపంచకప్‌ 2025 విజేతగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై-బ్రేక్‌లలో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం ద్వారా దివ్య కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ (GM) హోదాను కూడా సాధించింది. భారత్ నుండి ఈ ఘనత సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఆమె నిలిచింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా కూడా దివ్య రికార్డు సృష్టించింది.  

అద్భుతమైన ఆటతీరుతో

ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రా అయ్యాయి. దీంతో విజేతను నిర్ణయించడానికి టై-బ్రేకర్ అవసరమైంది, అందులో దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో గెలిచింది.  రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్‌లో తలపడటం విశేషం.

దివ్య దేశ్‌ముఖ్ సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగీ (చైనా)ని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆమె తన యువ వయస్సులోనే అనేక అంతర్జాతీయ పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శించి, 2020లో FIDE ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 2021లో ఆమె భారతదేశపు 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచింది. 

Also Read :  Special Trains: తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు..

Advertisment
తాజా కథనాలు