Bihar: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ ప్రారంభంలో ఎలక్షన్ కమిషన్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

New Update
Bihar Assembly Elections

Bihar Assembly Elections

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ ప్రారంభంలో ఎలక్షన్ కమిషన్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. నవంబర్‌లో రెండు లేదా మూడ దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కింద అప్‌డేట్‌ చేసిన ఓటరు లిస్టును విడుదల చేసిన అనంతం ఈ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రకటన రానుందని సమాచారం.  

Also Read: షాకింగ్ వీడియో.. భర్త మాటలు విని బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య..!

నవంబర్‌లో మొదటి రెండు వారాల్లో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 15 నుంచి 20 మధ్య ఓట్ల లెక్కింపు ఉండనుంది. నవంబర్ 22కి ముందే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అదికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన NDA కూటమి.. బిహార్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్‌ సీఎం నితీష్‌ను గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

బిహార్‌ మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం NDA కూటమిలో 131 మంది సభ్యులున్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీయూలో 45, హెచ్‌ఏఎం(S) లో నలుగురు, ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. ఇక విపక్ష ఇండియా కూటమికి 111 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. RJDలో 77 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో 19, సీపీఐ(ML), సీపీఐ(M)లో ఇద్దరు, సీపీఐలో ఇద్దరు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.  

Also Read: ధ్వంసమైన పాక్ ఎయిర్ బేస్‌లో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు