Bihar: బీహార్‌ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌.. ఆ కేసులో అభియోగాలు మోపిన కోర్టు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బిగ్ షాక్‌ తగిలింది. IRCTC స్కామ్‌కు సంబంధించి లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కొడుకు తేజస్వీ యాదవ్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం అభియోగాలు నమోదు చేసింది.

New Update
Court frames charges against Lalu prasad Ydav, Rabri and Tejashwi

Court frames charges against Lalu prasad Ydav, Rabri and Tejashwi

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బిగ్ షాక్‌ తగిలింది. IRCTC స్కామ్‌కు సంబంధించి లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కొడుకు తేజస్వీ యాదవ్‌పై సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈ స్కామ్‌లో లాలూ కుట్రకు పాల్పడినట్లు, పదవి దుర్వినియోగం చేసినట్లు కోర్టు వ్యాఖ్యానించింది.  ఈ క్రమంలోనే ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగ్నే ఈ కేసులో నిందితులపై అవినీతి, క్రిమినల్ కుట్ర, మోసం వంటి పలు అభియోగాలు ఖరారు చేశారు.  

Also Read: దారుణం.. 14 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి.. వరి పొలంలో పాతిపెట్టిన దుర్మార్గుడు

ఇదిలాఉండగా IRCTC స్కామ్‌లో లాలూ ఫ్యామిలీపై ఇప్పటికే సీబీఐ కూడా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. రాంచీ, పూరి హోటల్స్‌ కాంట్రాక్టుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. లాలూ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కామ్ జరిగినట్లు వెల్లడించింది. దీంతో 2017లో లాలు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. సీఐబీ ఆరోపణలను అంగీకరించిన రౌస్‌ అనెన్యూ కోర్టు.. ఈ కేసులో అభియోగాలు నమోదు చేసింది. దీనిపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా స్పందించారు. అభియోగాలు మోపినంత మాత్రానా మేము దోషులం కాదని పేర్కొన్నారు. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఏంటీ ఈ కేసు

 2004 నుంచి 2009 వరకు లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు IRCTC కేసు బయటపడింది. రెండు IRCTC హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను సూజాత హోటల్స్‌ అనే ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చే విషయంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఛార్జిషీట్‌ ప్రకారం చూసుకుంటే.. ''2004 నుంచి 2014 మధ్య రాంచీ, పూరీలోని BNR హోటల్స్‌ను భారతీయ రైల్వేల నుంచి IRCTC కి బదిలీ చేయడంలో కుట్ర జరిగింది. అలాగే ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా రూల్స్‌ను మార్చి టెండర్లు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని'' సీబీఆ ఛార్జిషీట్‌లో వెల్లడించింది.

Also Read: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

 ఇందులో IRCTC గ్రూప్ మాజీ జనరల్ మేనేజర్లు ఆర్‌కే గోయల్‌, వీకే అస్తానా, అలాగే సుజాత హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ యజమానుల పేర్లు కూడా ఉన్నాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాలూ ప్రసాద్ కుటుంబం IRCTC కేసులో ఇరుక్కోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. 

Advertisment
తాజా కథనాలు