/rtv/media/media_files/2025/10/11/big-shock-for-nitish-tejashwi-yadav-will-be-the-next-cm-2025-10-11-10-57-58.jpg)
Big shock for Nitish.. Tejashwi Yadav will be the next CM
Bihar C-Voter Survey: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి త్రిముఖ పోటీకి వేదిక సిద్ధమైంది. ఒకవైపు నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ, మరోవైపు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా కూటమి ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ కూడా తనదైన ముద్ర వేస్తోంది. వీటన్నింటి మధ్య, సి-ఓటర్ సర్వే (ప్రాధాన్యత గల ముఖ్యమంత్రి) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దాని ప్రకారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజాదరణలో వెనుకబడిపోయారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రజల మొదటి ప్రాధాన్యతగా మారారు. రాష్ట్ర రాజకీయ రంగాన్ని కదిలించిన ప్రశాంత్ కిషోర్ రెండవ స్థానంలో ఉండగా, నితీష్ కుమార్ మూడవ స్థానానికి పడిపోయారు.
ఈ సర్వే ప్రకారం, అధికార బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే ప్రజలు పట్టం కట్టారు. సీ ఓటర్ సర్వే అంచనాల ప్రకారం ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమి 38.3 శాతం ఓట్లతో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' పార్టీ కూడా 13.3 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచి కీలక పాత్ర పోషించనుంది.
కూటముల వారీగా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు మాత్రం భిన్నమైన సమాధానాలు వచ్చాయి. ఏకంగా 36.5 శాతం మంది ప్రజలు తేజస్వి యాదవ్‌కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత 23.2 శాతంతో ప్రశాంత్ కిశోర్ రెండో స్థానంలో నిలవగా, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేవలం 15.9 శాతం మద్దతుతో మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం.ఇక LJP (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ కు 8.8% మద్దతు లభించింది. బీహార్ సమస్యలను ఎవరు పరిష్కరించగలరని అడిగినప్పుడు, 36.5% మంది మహా కూటమిపై విశ్వాసం వ్యక్తం చేయగా, 34.3% మంది NDAని, 12.8% మంది జన్ సూరజ్‌ను ఎంచుకున్నారు, 9.4% మంది ఎవరూ చేయలేరని చెప్పారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యుహాల్లో మునిగి తేలుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ జన సురాజ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అయితే ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాలను సీ- ఓటర్ ప్రకటించింది. సెప్టెంబర్ ఫలితాలను తీసుకుంటే.. 35.5 శాతం మంది తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారని తేలింది. ప్రశాంత్ కిశోర్ కావాలని 23.1 శాతం మంది ఆకాంక్షించారు. నితీశ్ కుమార్‌ను కేవలం 16 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు 9.5, బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (samrat choudhary) 6.8 శాతం మంది మద్దతు ప్రకటించడం గమనార్హం.
అయితే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే తేజస్వి, నితీశ్ కుమార్‌లకు మద్దతు తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరిలో తేజస్వికి 40.6 శాతం మంది, నితీశ్‌కు 18.4 శాతం మంది మద్దతు దక్కింది. మరోవైపు సీఎం అభ్యర్థిగా ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఆయనకు మద్దతు ఇచ్చిన వారు 14.9 శాతం మాత్రమే. 8 నెలల్లో ఆయనకు ఆదరణ 8.2 శాతం వరకు పెరిగినట్టు సీ ఓటర్ డేటా వెల్లడించింది. కాగా, మహాఘఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తానేనని తేజస్వీ యాదవ్ ఇప్పటికే ప్రకటించుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తేజస్వీ యాత్రతో జోష్
కాగా తేజస్వీ యాదవ్ చేపట్టిన యాత్ర ఆర్జేడీ కార్యకర్తలను ఉత్తేజపరిచిందని 43.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. యాదవుల నుంచి మంచి స్పందన వస్తోందని 76.7 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుటుంబంలోని అంతర్గత వివాదాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని 45.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాలూ కుటుంబ కలహాలు పార్టీపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించబోవని యాదవుల్లో 70.6 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ హిందువులలో 46.6% మంది ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని 56.3 శాతం మంది సర్వేలో చెప్పారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని 43.7% మంది తెలిపారు. తమ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో గ్రామీణ ఓటర్ల కంటే (51.8%) పట్టణ ఓటర్లు (66.9%) ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సర్వే వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వీరేందర్ గుహ్‌మన్ మృతి...శోక సముద్రంలో పంజాబ్