విద్యార్థితో మసాజ్‌ చేయించుకున్న మహిళా టీచర్‌.. - VIDEO VIRAL

పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో  కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

New Update
massage

పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో  కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సంఘటన భోపాల్‌లోని  గాంధీనగర్‌లోని ప్రభుత్వ మహాత్మా గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చోటుచేసుకుంది. 

స్కూల్లో ఓ మహిళా టీచర్ కుర్చీలో  కూర్చుని ఉండగా ఓ స్టూడెంట్ ఆమె కాళ్ల దగ్గరు కూర్చుని ఆమె పాదాలకు మసాజ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ టీచర్ ఆ ఆరోపణను ఖండించింది.  తాను కావాలని అలా చేయలేదని,  తన కాలుకు గాయమైతే విద్యార్థులే ఇలా సాయం చేశారని ఆమె చెప్పడం గమనార్హం. 

 ఆప్యాయతతో మసాజ్‌ చేశాడని

స్కూల్‌ గేట్‌ వద్ద ఉన్న గుంతలో తన పాదం మెలిపడినట్లు ఉపాధ్యాయురాలు తెలిపింది. దీంతో విద్యార్థులు తనకు సహాయం చేశారని చెప్పింది. తనను కుర్చీలో కూర్చోబెట్టారని, మెలిపడిన పాదానికి నొప్పి తగ్గించడానికి ఒక విద్యార్థి ఆప్యాయతతో మసాజ్‌ చేశాడని వెల్లడించింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి  ఆమోద్ సక్సేనా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఒక బృందాన్ని ఆదేశించారు.

 విద్యార్థినులపై లైంగిక వేధింపులు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాలకు చెందిన విద్యార్థినీలు పలువురు లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ  విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 25 మంది విద్యార్థినీలు సోషల్ ఆడిట్ కోసం వచ్చిన అధికారులకు ఈ విషయమై  ఫిర్యాదు చేశారు. చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడిపై 25 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడు తమను చెప్పరానీ చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని  వారు రాసిన లేఖలో వివరించారు. తమతో పాటు ఇంకా చాలామంది బాధితులు ఉన్నప్పటికీ, వారు భయంతో చెప్పలేకపోతున్నారని తమ లేఖలో పేర్కొన్నారు.కాగా విద్యార్థులు తమ దృష్టికి తెచ్చిన సమస్యను అడిట్‌ అధికారులు  జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఈఓ సదరు ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశాలు జారీ చేయించారు.

ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు