/rtv/media/media_files/2025/01/04/FUhEfnhtlpwu9IEhfPbU.jpg)
Hyderabad Metro
Karnataka:మెట్రో రాక ముందు వరకు దూర ప్రయాణాలు చేసే వారు ఇంతకు ముందు బస్సులు, ఆటోలు ఎంపిక చేసుకునే వారు. కానీ మెట్రో వచ్చిన తరువాత సమయాన్ని మరింత ఆదా చేసుకునేందుకు చాలా మంది మెట్రోల వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే బెంగళూరు మెట్రో ప్రయాణికులకు పెద్ద షాకిచ్చింది.
Also Read: Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం
జనవరి 20 నుంచి అమల్లోకి...
కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మెట్రో రైలు ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదనకు శుక్రవారం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆమోదం తెలిపింది. అయితే పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. అయితే పెంచిన ఛార్జీల వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
Also Read: IMLT20: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్
BMRCL must act urgently to resolve key issues in its services. Overcrowding in Namma Metro has caused door malfunctions and disputes among passengers—this is unacceptable. BMRCL must prioritize adding metro coaches, expediting delayed lines, and improving operational efficiency. pic.twitter.com/p8nOdcFUqW
— P C Mohan (@PCMohanMP) January 17, 2025
అయితే ఛార్జీలను సవరించాలన్న ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సి) సిఫారసుకు మాత్రం బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో సవరించిన ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటిస్తామని బీఎమ్‌ఆర్‌సీఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతం కనీస ధర రూ. 10 ఉండగా.. గరిష్ట ధర రూ. 60గా ఉంది. స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు ఉంది. పెరగబోయే ధరలు.. కనీస ఛార్జీని రూ.15గా నిర్ణయించాలని చర్చ జరిగినట్లుగా సమాచారం. గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.80కి పెరగనుంది. అయితే పెరగబోయే ఛార్జీలు బీఎమ్‌ఆర్‌సీఎల్ ఇంకా వెల్లడించలేదు. అయితే మెట్రో ఛార్జీల పెంపుపై బెంగుళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read: కుంభమేళలో 7ఫీట్స్ బాడీ బిల్డర్ బాబా.. వైరల్
ఛార్జీల పెంపుపై. పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఛార్జీల పెంపుతో చాలా మంది ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తారన్నారు. దీంతో మెట్రో ప్రయాణాలు తగ్గిపోతాయన్నారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో రోజుకి 9 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు.