/rtv/media/media_files/2025/02/13/v0EeHccWc6RcGeu4JE4Y.jpg)
Bengaluru Metro
ఇటీవల బెంగళూరులో మెట్రో ప్రయాణ ఛార్జీలు 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెనక్కి తగ్గింది. టికెట్ ధరలను దాదాపు 30 శాతం శాతం తగ్గించేందుకు అంగీకరించింది. ఈ మేరకు BMRCL మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వర్ రావు వెల్లడించారు.
Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఛార్జీలను 50 శాతానికి పెంచడంతో ఇంతకుముందు గరిష్ఠంగా రూ.60 ఉన్న టికెట్ ధర ఏకంగా రూ.90కి పెరిగింది. దీంతో ఈ నిర్ణయంపై నగరవాసుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఛార్జీల విషయంలో ప్రజల నుంచి అభిప్రాయలను స్వీకరించామని మహేశ్వర్ రావు అన్నారు. దీనిపై సంబంధిత బోర్డు బుధవారం సమావేశమయ్యామని తెలిపారు. చివరికీ ధరలను 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన !.. కేంద్రం ఉత్తర్వులు
అయితే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు BMRCL టికెట్ ధరలను సవరించిన విషయం తెలిసిందే. ధరల పెంపు వల్ల ఉబర్, ఓలా లాగే పీక్, నాన్‌పీక్ అవర్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఫిబ్రవరి 9 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మార్పుల వల్ల బెంగళూరు వాసులు సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణాన్ని బ్యాన్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్‌లతో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలోనే మెట్రో అధికారులు టికెట్ ధరల్లో సవరణలు చేశారు.
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?
Follow Us