I Bomma: అవమానాలు భరించలేకే ఐబొమ్మకు రూపం.. రవి గురించి వెలుగులోకి నిజాలు

ప్రస్తుతం కటకటాల్లో జీవితం గడుపుతున్న ఐ బొమ్మ నిర్వాహకుడు రవి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్య, అత్త అవమానించడం వల్లనే అతను ఐబొమ్మను మొదలెట్టాడని చెబుతున్నారు.

New Update
Ibomma ravi

Ibomma ravi

ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడిని, ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని చేతనే ఈ పైరసీ వెబ్‌సైట్లనుమూసివేయించారు. ఇమ్మడి రవి విశాఖపట్నం వాసి. అతను కరీబియన్ ద్వీపాల్లో నివసిస్తూ తెలుగు సినిమాల మాస్టర్ కాపీలు దొంగతనం చేసి, వాటిని పైరసీ వెబ్‌సైట్లలో పోస్టు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. హైదరాబాద్‌లో అతను మూడు కోట్ల విలువ చేసే ప్రైయివేట్ నివాసాన్ని కూడా కొన్నాడు.

రవిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇందులో అతని గురించి మరిన్ని వివరాలు తెలిసాయని చెబుతున్నారు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు రవి. ఆమె ఉన్నత, డబ్బుకన్న కుటుంబం నుంచి వచ్చింది. పెళ్ళి తర్వాత రవి సంపాదనతో భార్యకు నెట్టుకు రావడం కష్టంగా మారింది. దీంతో ఇద్దరి మధ్యనా మనస్పర్థలు వచ్చాయి. డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా హేళన చేయటాన్ని భరించలేక పోయాడు. భార్యకు తనను తాను నిరూపించుకోవడం కోసం.. వెబ్‌ డిజైనర్‌గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లకు రూపమిచ్చాడు రవి. కొన్ని నెలలకే బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావటంతో ఊహించనంత డబ్బు వచ్చి వాలింది.

నెదర్లాండ్స్ కు షిఫ్ట్ అయి..

దీని తరువాత తన సంపాదనను ఆధారాలతో సహా చూపించినా భార్య మాత్రం అతనితో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. దీంతో 2021లో ఇద్దరూ విడిపోయారు. దాని తరువాత రవి నెదర్లాండ్స్ కు మకాం మార్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్న ఇంటిని కూడా అమ్మేశాడు. తాను ఎక్కడున్నా అక్కడి నుంచే వెబ్‌సైట్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్‌ నేరస్థులు, గేమింగ్‌ ముఠాలకు విక్రయించి రూ.20 కోట్లు సంపాదించాడు. అయితే నెదర్లాండ్స్ లో పూర్తి ేర్పాట్లు చేసుకుంటుండగానే రవి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు.

ప్రస్తుతం ఐబొమ్మ, బప్పం టీవీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వెబ్‌సైట్ యూజర్లు ఇప్పుడు ఈ సర్వీసులను యాక్సెస్ చేయలేరు. ఈ దశలో పోలీసులు పైరసీ కంటెంట్ వ్యాప్తిపై కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. పోలీసులు అతని చేతనే ఈ పైరసీ వెబ్‌సైట్లనుమూసివేయించారు. అప్పటి నుండి, ఐబొమ్మ వెబ్‌సైట్ యాక్సెస్ చేయాలనుకున్నవారికి అది ఓపెన్ కావడం లేదు. "మీకు గతంలో మా గురించి బాగా తెలిసి ఉండొచ్చు లేదా మా సేవలను ఉపయోగించి ఉండవచ్చు. కానీ మీకు ఓ చెడు వార్త - మా సర్వీసులు మీ దేశంలో పర్మనెంట్‌గా నిలిపివేస్తున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించమని కోరుతున్నాం." అని మెసేజ్ దర్శనమిస్తోంది.

Also Read: TG Crime : గుండె పగిలే విషాదం.. నువ్వు లేని జీవితం నాకొద్దంటూ.. !

Advertisment
తాజా కథనాలు