Toll tax: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక టోల్‌గేట్లు ఉండవ్, కానీ! హైవేలపై వెళ్తున్నప్పుడు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఇకపై ఇది ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. దీంతో నేరుగా బ్యాంకులే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. By Seetha Ram 06 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇకపై దూర ప్రయాణాలు చేసేవారు హైవేలపై ఆగాల్సిన పని లేదు. అంతేకాదు టోల్‌గేట్ల వద్ద టోల్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనుకుంటున్నారా? దానికీ ఓ రీజన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మరో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక నుంచి టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పని లేకుండా నేరుగా బ్యాంక్ నుంచే డబ్బులు కట్ అవుతాయి. అదెలా అనే విషయానికొస్తే.. Also Read: ట్రంప్ గెలుపు..ఆసక్తికరంగా మస్క్ పోస్ట్ ! 60 కి.మీ ఒక టోల్ గేట్ ఒక్క ద్విచక్ర వాహనం మినహా మిగతా వ్యాన్, బస్, లారీ, కారు వంటి వాహనాలు హైవేలపై వెళ్లినపుడు టోల్ గేట్ల వద్ద టోల్ ట్యాక్స్ కచ్చితంగా చెల్లించాలి. అయితే ఈ టోల్ గేట్లు అనేవి ప్రతి 60 కి.మీ ఒకటి ఉంటుంది. అక్కడ ఈ వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. Also Read: మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్ 2.o! ఇక టోల్ ట్యాక్స్ కడుతున్నప్పుడు కొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. చాలా వాహనాలు నిలిచిపోతాయి. అదే సమయంలో టెక్నికల్ ఇష్యూ వస్తే వాహనదారుల ఇంకాస్త ఇబ్బంది పడతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈజీ టెక్నాలజీని అందుకుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. Also Read: ఒక్క అడుగు...కానీ స్వింగ్ స్టేట్స్ లోనే అసలు విషయం...! కేంద్రం కీలక నిర్ణయం ఇక హైవేపై వెళ్తున్నప్పుడు ఎక్కడా ఆగాల్సిన పని లేకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శాటిలైట్ ఆధారంగా టోల్ కలెక్షన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రెడీ చేసింది. దీని కోసం దేశంలో ఉన్న ప్రధాన బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. Also Read: ఎంగోంగా లిస్ట్ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్ అధికారి భార్య మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థను ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాంకులే నేరుగా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థను NHAI తీసుకొస్తోంది. ఈ వ్యవస్థ గ్రాంటీస్ ముందు సెన్సార్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్డ్ సిస్టమ్ ద్వారా వాహనాలు రోడ్లపైకి వచ్చినపుడు.. వాటి ఇన్‌ఫర్మేషన్ సేకరిస్తుంది. దీంతో ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థకు మెసేజ్ పంపించి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటుంది. #central-goverment #banks #toll-gates #toll మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి