America Precident: మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌ 2.o!

అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి ట్రంప్‌ అధిరోహించబోతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరుఫున పోటీ చేసి ట్రంప్‌ 277 ఎలక్టోరల్‌ ఓట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి అగ్రరాజ్యానికి పెద్దన్న మరోసారి అధినేత అయిపోయాడు.

New Update

US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో ట్రంప్‌ 277 ఎలక్టోరల్‌ ఓట్లతో విజయ దుందుభి మోగించారు. కమలా హారిస్‌ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోల్‌ అయ్యాయి. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ట్రంప్‌ ముందంజలోనే ఉన్నారు.

Also Read: భారీగా పెరగనున్న మద్యం ధరలు!

ఈ ఎన్నికల్లో ఎంతో ముఖ్యమైన స్వింగ్‌ స్టేట్స్‌ ఫలితాల్లో కాస్తా అటు ఇటు అయినప్పటికీ కూడా ట్రంప్‌ నే విజయం వరించింది. ముందు నుంచి కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఆయనే గెలిచారు. మరి ఈ విజయం తో ట్రంప్‌ 2.o..పాలన పై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. 

Also Read: ఒక్క అడుగు...కానీ స్వింగ్‌ స్టేట్స్‌ లోనే అసలు విషయం...!

రెండోసారి అధ్యక్ష పీఠం...


277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ క్రాస్‌ చేసిన ట్రంప్‌, 67,204,711 పాపులర్‌ ఓట్లు సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్‌… రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు.

Also Read: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్

మేజిక్‌ ఫిగర్‌కు 44 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో హ్యారిస్‌ ఆగిపోయారు. చివర్లో గట్టి పోటీ ఇచ్చినా స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ఆధిపత్యం కొనసాగడంతో కమలా ఓటమి పాలవ్వక తప్పలేదు. 

Also Read:  ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే!

 మొదటి నుంచి చివరి వరకూ ట్రంప్ దూకుడు కొనసాగింది. ఒక సమయంలో  స్లో అయిన ట్రంప్ 230 ఓట్ల దగ్గర చాలాసేపు నిలిచిపోయారు. ఆ సమయంలో కమలా హ్యారిస్ వేగంగా అందుకుని గట్టి పోటీ ఇచ్చారు. 226 ఓట్ల దగ్గర కమలా ఆగిపోయారు. కమల హ్యారిస్‌కు 62,303,005 పాపులర్ ఓట్లు రాగా చివర్లో ట్రంప్ మెరుపు వేగంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు