Trump-Musk: ట్రంప్‌ గెలుపు..ఆసక్తికరంగా మస్క్‌ పోస్ట్‌ !

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందించారు. గేమ్‌ సెట్‌ అండ్‌ మ్యాచ్‌ అని రాసుకొచ్చారు.

New Update
Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్‌..మస్క్‌ డ్యాన్స్‌ చూడతరమా!

Us Elections: అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తరుఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విస్తృత ప్రచారం చేశారు. తాజాగా ఓటింగ్‌ ముగిసి, ఫలితాలు వెలువడిన  తరుణంలో ట్రంప్‌ మరోసారి గెలిచి పీఠాన్ని అధిరోహించారు. 

Also Read:  ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం!

గేమ్‌ సెట్‌ అండ్‌ మ్యాచ్‌..

ఈ తరుణంలో మస్క్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. గేమ్‌ సెట్‌ అండ్‌ మ్యాచ్‌ అని రాసుకొచ్చారు.. టెన్నిస్‌ మ్యాచ్‌ లు తరువాత ఈ పదాలను ఉపయోగిస్తారు.

Also Read:  ఎంగోంగా లిస్ట్‌ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్‌ అధికారి భార్య

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో ట్రంప్‌ 277 ఎలక్టోరల్‌ ఓట్లతో విజయ దుందుభి మోగించారు. కమలా హారిస్‌ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోల్‌ అయ్యాయి. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ట్రంప్‌ ముందంజలోనే ఉన్నారు.

Also Read: ఒక్క అడుగు...కానీ స్వింగ్‌ స్టేట్స్‌ లోనే అసలు విషయం...!

ఈ ఎన్నికల్లో ఎంతో ముఖ్యమైన స్వింగ్‌ స్టేట్స్‌ ఫలితాల్లో కాస్తా అటు ఇటు అయినప్పటికీ కూడా ట్రంప్‌ నే విజయం వరించింది. ముందు నుంచి కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఆయనే గెలిచారు. మరి ఈ విజయం తో ట్రంప్‌ 2.o..పాలన పై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. 

Also Read:  మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌ 2.o!

277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ క్రాస్‌ చేసిన ట్రంప్‌, 67,204,711 పాపులర్‌ ఓట్లు సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్‌… రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు.మేజిక్‌ ఫిగర్‌కు 44 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో హ్యారిస్‌ ఆగిపోయారు. చివర్లో గట్టి పోటీ ఇచ్చినా స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ఆధిపత్యం కొనసాగడంతో కమలా ఓటమి పాలవ్వక తప్పలేదు. 

మొదటి నుంచి చివరి వరకూ ట్రంప్ దూకుడు కొనసాగింది. ఒక సమయంలో  స్లో అయిన ట్రంప్ 230 ఓట్ల దగ్గర చాలాసేపు నిలిచిపోయారు. ఆ సమయంలో కమలా హ్యారిస్ వేగంగా అందుకుని గట్టి పోటీ ఇచ్చారు. 226 ఓట్ల దగ్గర కమలా ఆగిపోయారు. కమల హ్యారిస్‌కు 62,303,005 పాపులర్ ఓట్లు రాగా చివర్లో ట్రంప్ మెరుపు వేగంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు