Naga Chaitanya – Shobitha: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత

కొత్త జంట చైతూ-శోభిత.. అక్కినేని నాగార్జునతో కలిసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
chai shobita

అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ్ల ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 04 బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట మొదటసారి బయటికొచ్చారు. పెళ్లి అయిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ జంట శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. అక్కినేని నాగార్జున కలిసి చైతూ-శోభిత శుక్రవారం శ్రీశైలం వెళ్లారు.

భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?

Also Read: ఓవర్సీస్‌లో పుష్ప 2 వైల్డ్ ఫైర్.. రప్పా రప్పా లాడించిన బన్నీ

ఇది కూడా చదవండి:ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

Advertisment
తాజా కథనాలు