China-Taiwan: తైవాన్ చైనాలో భాగమే..ట్రంప్ కు కన్ఫార్మ్ చేసిన జిన్ పింగ్

తైవాన్ పై చైనా వైఖరిని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి నొక్కి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని మరోసారి ధృవీకరించారు. తైవాన్ పై తమ ఆధిపత్యం కొనసాగుతుందని అన్నారు.

New Update
taiwan

తైవాన్ విషయంలో చైనా, జపాన్ మధ్య గతకొంత కాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాధ్యక్షులూ దీనిపై పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. తైవాన్ పై చైనా దాడి నిజమైతే..తామ సైనిక చర్యకు దిగుతామని జపాన్ ప్రధాని సనే తకైచి రీసెంట్ గా హెచ్చరించారు. దీనిని చైనా ఖండించింది. తైవాన్ ఎప్పటికీ తమదే అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. జపాన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సంద్భంలో చైనా, జపాన్ మధ్య ప్రయాణాలు నిషేధించారు. అలాగే చైనాలో జపనీస్ సినిమాలను నిలపేశారు. జపనీస్ సముద్ర ాహార దీగుమతులను నిలిపేశారు. మరోవైపు జపాన్ తూర్పు చైనా ముద్రంలో గస్తీని ఏర్పాటు చేసింది. అలాగే తైవాన్ సమీపంలో క్షిపణులను మోహరించాలని కూడా యోచిస్తోంది. 

తైవాన్ ను వదలం..జిన్ పింగ్..

దీనిపై తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేశారు. తైవాన్ గురించి మాట్లాడారు. తైవాన్ ఎప్పటికీ తమదేనని స్పష్టం చేశారు. తైవాన్ పై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేయగా..రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో తైవాన్ తమకు కీలక భాగమని జిన్ పింగ్ చెప్పారు. దీంతో పాటూ అమెరికా, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ఇరు దేశాధినేతలూ చర్చించుకున్నారు. గత నెల థాయ్ లాండ్ సమావేశంలో సాధించిన పురోగతిని రెండు దేశాలూ కాపాడుకోవాలని ఇరువురూ నాయకులూ అంగీకరించారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే జిన్ పింగ్...ట్రంప్ ను ఏప్రిల్ లో బీజింగ్ సందర్శించాలని ఆహ్వానించారు. ఈ ఏడాది చివర్లో జిన్ పింగ్ కూడా అమెరికాకు వెళ్ళనున్నారు.

ఉక్రెయిన్, ఫెంటానిల్ తయారీకి ఉపయోగించే రసాయనాల ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల గురించి కూడా ట్రంప్, జిన్ పింగ్ మాట్లాడుకున్నారు. దీంతో పాటూ ఇటీవలి ఒప్పందం నిబంధనల ప్రకారం అమెరికా సోయాబీన్స్ కొనుగోళ్లను పెంచడం గురించి కూడా చర్చించారు. అమెరికాకు వెళ్లే అరుదైన ఖనిజాలు మరియు కీలకమైన ఖనిజాల ఎగుమతులను నియంత్రించే "సాధారణ లైసెన్సుల" కోసం రెండు దేశాలు ఇప్పటికీ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు అమెరికా తన సుంకాలను అమలును ఆపలేదు. ట్రంప్ పరిపాలన కూడా అధునాతన కృత్రిమ మేధస్సు చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడానికి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని పునరాలోచిస్తోంది

Advertisment
తాజా కథనాలు