Deepotsav: వావ్ VIDEO.. 26లక్షల దీపాలతో అయోధ్యలో గిన్నిస్ రికార్డు

సరయూ నదీ తీరంలోని ఘాట్‌లు, రామ్ కీ పైడి ప్రాంతంలో 26 లక్షల (26,11,101)కు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గతేడాది 25 లక్షల దీపాల రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. దీపాల వెలుగులో అయోద్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Deepotsav

Deepotsav: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన తొమ్మిదో దీపోత్సవం వేడుకల్లో అయోధ్య నగరం మరోసారి చరిత్ర సృష్టించింది. సరయూ నదీ తీరంలోని ఘాట్‌లు, రామ్ కీ పైడి ప్రాంతంలో 26 లక్షల (26,11,101)కు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి, గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గత సంవత్సరం నెలకొల్పిన 25 లక్షల దీపాల రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. దీపాల వెలుగులో నిండిన అయోద్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: దీపావళి పండగను క్రిస్మస్ లాగా చేసుకోండి.. అఖిలేష్ సంచలన కామెంట్స్!

దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ అద్భుతమైన దీపాల పండుగకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హాజరై, సరయూ మాతకు మహా హారతి ఇచ్చి వేడుకలను ప్రారంభించారు. అయోధ్యలోని మొత్తం 56 ఘాట్‌లు మరియు వివిధ ముఖ్య ప్రదేశాలలో దీపాలను వెలిగించడానికి అవధ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన 33,000 మందికి పైగా వాలంటీర్లు కృషి చేశారు.

Also Read: ఇస్రోకు చంద్రయాన్‌-2 నుంచి కీలక సమాచారం.. చంద్రుడిపై సూర్యుడి ప్రభావం..!

శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా, త్రేతాయుగ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దీపాల కాంతితో అయోధ్య ఆధ్యాత్మిక శోభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. సాంస్కృతిక ప్రదర్శనలు, డ్రోన్ షోలు, లేజర్ ప్రదర్శనలు, సంగీత నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఈ దీపోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, వారసత్వం మరియు విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రికార్డుల పరంపర అయోధ్య ఖ్యాతిని ప్రపంచ పటంలో మరింత సుస్థిరం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఘనత సాధించడం వెనుక వాలంటీర్ల నిబద్ధత, స్థానిక ప్రజల సహకారం ఎంతగానో ఉందని కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు