Jana Nayagan: జననాయగన్‌ను బీజేపీ అడ్డుకుంటోంది: రాహుల్ గాంధీ

ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

New Update
‘Attack on Tamil culture’, Rahul Gandhi accuses Centre of blocking Vijay’s Jana Nayagan

‘Attack on Tamil culture’, Rahul Gandhi accuses Centre of blocking Vijay’s Jana Nayagan

ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు నుంచి జాప్యం జరగడంతో చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. తమిళ సంప్రదాయాలపై బీజేపీ సర్కార్ దాడి చేస్తోందంటూ విమర్శించారు. ప్రధాని మోదీ తమిళ ప్రజల గొంతు నొక్కాలని యత్నిస్తున్నారని.. ఇది ఎప్పటికీ సాధ్యం కాదంటూ ధ్వజమెత్తారు.  

Also Read: భారత్ లో నిఫా వైరస్ డేంజర్ బెల్స్.. ఎలా సోకుతుందో తెలుసా?

ఇక వివరాల్లోకి వెళ్తే హెచ్ వినోద్‌ దర్శకత్వంలో వచ్చిన జననాయగన్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్‌.. సెన్సార్ బోర్డుకు గత శుక్రవారం ఆదేశించింది. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ కేసును పరిగణలోకి తీసుకున్న డివిజన్ బెంచ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Also Read: సంక్రాంతి వేళ బిగ్ షాక్.. ప్రముఖ కంపెనీలో భారీగా లే‎ఆఫ్‎లు

ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ఇందులో ప్రభుత్వాలను విమర్శించేలా ఉన్న 50కి పైగా పొలిటికల్ డైలాగులు, సీన్‌లను కట్ చేయాలని లేదా మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది. కోర్టులో వాదనల వల్ల జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమాకు బ్రేక్ పడింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 15న దీనిపై విచారణ చేయనుంది. మరి ఈ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.  

Advertisment
తాజా కథనాలు