/rtv/media/media_files/2026/01/13/meta-2026-01-13-18-25-56.jpg)
Meta plans 1,500 job cuts as focus towards AI and data centres surges
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో అనేక రంగాల్లో ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. గతేడాది మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి బడా కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీగా లేఆఫ్స్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా దిగ్గజం ఫెస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా ఈ ఏడాది 1500 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Also read: టార్గెట్ ఇరాన్...భారత్ పై భారీ ఎఫెక్ట్..75 శాతం తప్పవేమో
అయితే ఈ లేఆఫ్‌లు మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో జరగనున్నాయి. దీంతో దాదాపు 10 శాతం ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు వంటి రంగాల్లో పెట్టుబడులపై మెటా ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇదే సమయంలో ఇతర విభాగాల్లో కూడా భారీగా ఖర్చులు తగ్గించనుంది. మెటాలో రియాల్టీ ల్యాబ్స్ అనేది కీలకమైన విభాగం. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR)కి సంబంధించిన ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌లకు బాధ్యత వహిస్తుంది.
Also read: హిందువులకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కావాలి.. హిందూ సంఘాల డిమాండ్
న్యూయార్క్ టైమ్స్ తెలిపిన ఓ నివేదిక ప్రకారం.. మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్‌వర్త్ బుధవారం రియాలిటీ ల్యాబ్స్ ఉద్యోగులందరితో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇది అత్యంత ముఖ్యమైన సమావేశంగా భావిస్తున్నారు. ఈ మీటింగ్‌కు ఉద్యోగులందరూ హాజరవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇక ఈ ఏడాది మిగతా టెక్ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Follow Us