Nipah Virus: భారత్ లో నిఫా వైరస్ డేంజర్ బెల్స్.. ఎలా సోకుతుందో తెలుసా?

భారత్ లో నిఫా వైరస్ మళ్ళీ నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు నర్సులు దీని బారిన పడడంతో పశ్చిమ బెంగాల్ ఎయిమ్స్ హెచ్చరికలను జారీ చేసింది. అన్ని రాష్ట్ర ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసింది. 

New Update
Three Kerala districts on alert after Nipah cases

Three Kerala districts on alert after Nipah cases

కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్ గా నిఫా గుర్తించబడింది. ఇది మళ్ళీ భారత్ లోకి ప్రవేశించనట్టు తెలుస్తోంది. పశ్చిమ్ బెంగాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇద్దరు నర్సులు ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిద్దరికీ కూడా మరో రోగి ద్వారా వ్యాపించవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని..రాష్ట్రం పూర్తి సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ తెలిపారు. అలాగే మొత్తం భారత్ లో అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశామని చెప్పారు. తెలియకుండా రోగులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళే అవకాశం ఉండడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని వెస్ట్ బెంగాల్ ఎయిమ్స్ హెచ్చరించింది. 

ఇద్దరు నర్సుల పరిస్థితి విషమం..

2001లో సిలిగురిలో, 2007లో టెహట్టాలో నిపా వైరస్ వ్యాప్తి తర్వాత...పశ్చిమ బెంగాల్ లో మళ్ళీ ఇప్పుడే నిఫా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు నర్సులకు ఈ వైరస్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇద్దరు నర్సులు రెండు వేర్వేరు ఇళ్లలో పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటున్నారు. ఇందులో ఒక మహిళ...ఒక పెళ్ళికి హాజరు కావడమే కాక..పలు ప్రదేశాలను కూడా సందర్శించింది. అలాగే విధులకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇద్దరు నర్సుల పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరితిత్తులు, మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ (ఎన్సెఫాలిటిస్) కారణంగా, ఇద్దరినీ వెంటిలేషన్‌లో ఉంచారు. వారు ఎవరితో కాంటాక్ట్ అయ్యారో గుర్తించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభమైంది. 

ఎలా సోకుతుంది..

నిఫా వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. దీన్ని జునోటిక్‌ అంటారు. తొలిసారి నిఫా వైరస్‌ను 1999లో గుర్తించారు. నిఫా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే  గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా వైరస్‌ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుంది.

లక్షణాలివే..

నిఫా వైరస్‌లో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా  అసిమ్టమాటిక్‌గా ఉంటుంది. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకుంటాడు. మరోవైపు దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ను కూడా కనుగొనలేదు. అలాగే కచ్చితమైన వైద్యం అంటూ కూడా ఏదీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. రోగిని ఐసోలేషన్‌లో ఉంచి.. తగినంత నీరు అందిస్తారు. రోగికి ఉన్న లక్షణాలకు ట్రీట్ మెంట్ అందిస్తారు. 

Advertisment
తాజా కథనాలు