Hyderabad: లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం.. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి!
హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. నిందితుల్లో ఒకడికి యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించింది. విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి.