/rtv/media/media_files/2024/11/04/UroNKTfOKdGV02Yp0UZ9.jpg)
ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు రావిరాజు కీలక ప్రకటన చేశారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు. ఇప్పటివరకు తాను ఏ పార్టీ తరఫునా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదన్నారు. గ్రాడ్యుయేట్స్ కు ఏ కష్టమొచ్చినా.. ఆపద వచ్చినా వాళ్ళ తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. గ్రాడ్యుయేట్స్ అంతా ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నానన్నారు.