/rtv/media/media_files/2025/04/17/yaPpD3JbfxogoToAiuPY.jpg)
Pakistan army chief Asim Munir
ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతులకు భారతీయుల రక్తం అనేక సార్లు అంటుకుంది. అసిమ్ మునీర్ గతంలో ISI (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. భారత్‌పై జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక అసిమ్ మునీర్ హస్తం ఉంది. ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్ అంనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో పర్యటకులపై జరిగిన టెర్రర్ అటాక్‌ను 3 రోజుల ముందు అసిమ్ మునీర్ కాశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. అది తమ ప్రధాన రక్తనాళమని ఆయన చెప్పాడు. ఈ వ్యాఖ్యలతోనే రెచ్చి పోయి లష్కరే తో యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉద్రవాద సంస్థ కశ్మీర్ లో అటాక్ చేసిందని ఇండియన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు భావిస్తున్నారు. అంతేకాదు 2018 నుంచి భారత్‌పై జరిగిన టెర్రర్ అటాక్‌ల కుట్రల వెనుక అసిమ్ మునీర్ ఉన్నారని కొన్ని సందర్భాలని పరిశీలిస్తే అర్థమవుతుంది.
#GlobalTerrorist
— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 24, 2025
📍Former Pentagon official Michael Rubin SLAMS Pakistan for its role in Pahalgam terror attack — "Pakistan Army Chief Asim Munir is a terrorist like Osama Bin Laden."
"Frankly, it's now the duty of India to do to Pakistan & Pakistan's ISI what Israel did to… pic.twitter.com/cn7YdnWySl
2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 40 మంది CRPF సైనికులు అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. ఈ దాడి జరిగినప్పుడు అసిమ్ మునీర్ ISI చీఫ్‌గా ఉన్నాడు. ఐఎస్ఐకి తెలియకుండా ఇంత పెద్ద ఉగ్రదాడి జరగదని భారతదేశం నమ్ముతుంది.
VIDEO | Pahalgam terror attack: Former UP DGP Vikram Singh says, "Few days back, Pakistan army chief General Asim Munir had called Kashmir their 'jugular vein'. Using such provocative statement isn't right and this incident should be condemned. The entire country is in shock over… pic.twitter.com/7ovpjRztFc
— Press Trust of India (@PTI_News) April 24, 2025
2016 జనవరి 2న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో ఏడుగురు భారతీయ భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. అసిమ్ మునీర్ 2018 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించినందున ఆయన అప్పుడు ISI చీఫ్ కాదు. ఈ దాడుల వెనుక ISI, పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మునీర్ ఆ ఉగ్రదాడిలో కీలక కుట్రదారుడని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.