Miss World 2025: హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలైన మిస్ వరల్డ్ పోటీలు.. లైవ్ ఇక్కడ చూడండి

72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా ఘనంగా మొదలయాయ్యి. తొలిరోజు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వివిధ దేశాల అందగత్తెలకు స్వాగతం పలికారు.

New Update

Miss World 2025:  మిస్ వరల్డ్ 2025  72వ ఎడిషన్‌ అందాల పోటీలకు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆథిత్యం వహిస్తోంది. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా  జరగనున్న ఈ వేడుకను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. 

గ్రాండ్ ఓపెనింగ్ 

ఈరోజు  గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర  అధికారులు ఈ కార్యక్రమాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈవెంట్ ని ప్రారంభించారు.

 ఆ తర్వాత తెలంగాణ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం వివిధ దేశాల అందగత్తెలు తమ ఫ్యాషన్  కాస్ట్యూమ్స్ లో ర్యాంప్ వాక్ చేస్తూ స్టేజ్ పై మెరిశారు. ఈ పోటీలో భారతదేశం తరఫున నందిని గుప్తా,  నికితా పోర్వాల్ పాల్గొంటున్నారు.

దాదాపు 20 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో అందగత్తెలు పోటీలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలను సందర్శించనున్నారు. ఈ పోటీ ద్వారా తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే మే 31, 2025న హైటెక్స్ సెంటర్  హైదరాబాద్ లో జరగనుంది. 

telugu-cinema-news | cinema-news | telugu-news | latest-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు