Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్! కేక్ తెచ్చిన వ్యక్తితో ఏం సంబంధం ?

పాక్ కు గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక విషయాలు తెలుస్తున్నాయి. పాకిస్థాన్ హైకమిషన్ లోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఎవరు? జ్యోతికి అతనికి లింకేంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

New Update
Jyoti Malhotra

Jyoti Malhotra

Jyoti Malhotra :పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా విచారణలో కొత్తకొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దేశ రక్షణ, భారత ఆర్మీకి సంబంధించిర రహస్యాలను శత్రుదేశానికి చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాక పహల్గాం ఉగ్రదాడి విషయంలోనూ జ్యోతి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పహల్గాం వెళ్లిన జ్యోతి అక్కడి ఏరియాను వీడియోలో చిత్రికరించడంతో పాటు వాటికి ఉగ్రవాదులకు పంపినట్లు తేలింది. ఇక అదే సమయంలో  జ్యోతితో ఓ గడ్డం ఉన్న వ్యక్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలూ  వైరల్‌గా మారాయి.  ఆ గడ్డం వ్యక్తే  పహల్గాం దాడి తర్వాత కేక్ తీసుకొని పాకిస్థాన్ ఎంబసీకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అసలు గడ్డం వ్యక్తి ఎవరు? జ్యోతికి, ఎంబసీకి, పాకిస్థాన్‌ కు ఉన్న లింకేంటీ  అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పహల్గాం అటాక్‌లో అతని పాత్రపై పలు అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

Also Read:West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత రెండు రోజులకు ఆ గడ్డం వ్యక్తి న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌ వద్ద ప్రత్యక్షమయ్యాడు.  ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో  తాజాగా వైరల్ అవుతున్నాయి.  అయితే అతను చేతిలో కేక్ పట్టుకొని, ఫోన్‌లో మాట్లాడుతూ పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్తున్న సమయంలో.. మీడియా కెమెరాలు రికార్డు చేశాయి. ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా శోకంలో  ఉన్న సమయంలో ఆయన  కేక్ ఎందుకు తీసుకెళ్లాడు? అనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో ఆ వ్యక్తిని మీడియా వర్గాలు ప్రశ్నించాయి కూడా.ఎవరిదైనా బర్త్‌డే లేదా ఏదైనా ఫంక్షన్‌ జరిపారా?  దేనికోసం సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆ వ్యక్తిని జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ, అతడు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా పాక్ రాయబార కార్యాలయంలోకి వెళ్లిపోయిన విడియోలు వైరలయ్యాయి. 

Also Read:Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

జ్యోతి అరెస్ట్‌ అయిన తర్వాత పాకిస్థాన్ హైకమిషన్ భవనంలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యతి కలిసి ఉన్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో జ్యోతి మల్హోత్రాతో కలసి దిగిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాక్ పర్యటన సమయంలో ఓ వేడుకలో జ్యోతి స్వయంగా తీసిన వీడియోలో కూడా ఈ గడ్డం వ్యక్తి కనిపించాడు. దీంతో ఈ వ్యక్తి ఎవరు..ఆయనకు పాక్‌ రాయబార కార్యాలయానికి ఏం సంబంధం? జ్యోతితో ఆయనకున్న పరిచయం ఏంటీ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  పహల్గాం ఉగ్రదాడి ప్లానింగ్‌లో అతడి పాత్ర ఉందా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, పహల్గాం దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాక్‌లో పర్యటించినట్లు తేలింది. అంతేకాదు చైనాకు కూడా వెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ పాక్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే డానిష్‌ అనే అధికారితోనూ జ్యోతికి పరిచయాలున్నట్లు తేలింది. ఆ పరిచయాలతోనే జ్యోతిని డానిష్ ట్రాప్ చేసి సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇదే సమయంలో జ్యోతికి, గడ్డం ఉన్న వ్యక్తికి, డానిష్‌ కు మధ్య ఉన్న సంబంధం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

Advertisment
తాజా కథనాలు