Annamalai: బీజీపీ అధ్యక్ష పదవి నుంచి అన్నమలై ఔట్.. !

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. AIDMK చీఫ్ పళనిస్వామి పెట్టిన కండిషన్‌ వల్లే అన్నాలైను తొలగించారనే ప్రచారం నడుస్తోంది.

New Update
Annamalai

Annamalai

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తోందని.. ఇందులో భాగంగానే పార్టీలో మార్పులు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ.. ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోనుంది. బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి.. అన్నామలైను బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాలనే కండిషన్‌ను పెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగానే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంటున్నాయి. 

Also Read: పినరయ్ విజయన్‌కు షాక్.. కూతురికి జైలు శిక్ష ?

అయితే శుక్రవారం కోయంబత్తూర్‌లో అన్నామలై మీడియాతో మాట్లాడారు. '' తమిళనాడు బీజేపీలో మాకు ఎలాంటి పోటీ లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని త్వరలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఈసారి నేను ఆ పదవి రేసులో లేను. తమిళనాడు బీజేపీలో సమర్థమంతమైన నేతలు ఉన్నారని'' అన్నారు. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నమలైను హైకమాండ్‌ తీసేసినట్లు స్పష్టమయ్యింది. మరీ తర్వాతి బీజేపీ చీఫ్ ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Also Read: రైల్వే స్టేషన్‌లో ఘోరం.. బావ ముందే మరదలిపై అత్యాచారం!

ఇదిలాఉండగా 2026లో తమిళనాడులో అసెంబ్లీ జరగనున్నాయి. డీఎంకే పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యూహంలో భాగంగానే పాత మిత్రుడైన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ప్లాన్ వేసింది. ఇప్పటికే AIDMK చీఫ్‌ పళనిస్వామితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సమావేశమై పొత్తు అంశంపై చర్చించారు. అయితే పళనిస్వామి అన్నామలైను బీజేపీ చీఫ్ బాధ్యతల నుంచి తొలగించాలని షరతు పెట్టారని.. అందుకే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

 rtv-news | annamalai | bjp

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు