Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే..

ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. వాటిల్లో ప్రధానంగా కుందేలు, వన్య ప్రాణులు, నెమళ్ళు...కొన్ని చోట్ల గొడ్డు మాంసంపై నిషేధం ఉంది. 

New Update

Banned Animal Meats: 

జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారులు చేసుకున్న పార్టీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది నిజమో కాదో తెలియదు. ఇక వాస్తవానికి ఇండియాలో పలు రకాల మాంసాలపై నిషేధం ఉంది. 

పవిత్ర జంతువు..

మతపరమైన అంశాల కారణంగా భారత్‌లో కుందేలు మాంసం అమ్మకాన్ని నిషేధించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా భారత్‌లో చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం తినడం నిషేధం. ఇక ఆవులు, దూడలు, ఎద్దులును వధించడం కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్. అటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం వణ్య ప్రాణుల మంసాన్ని తినడం, అమ్మడం నేరం.

Also Read: Hyderabad: అశోక్‌నర్‌‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు

కుక్క మాంసం...

నాగాలాండ్, మిజోరాంలలో కుక్కల మాంసాన్ని అమ్మడం తినడం చాలా పాత విషయం. కాని ఇది చాలా దారుణమని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ నాగాలాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కుక్క మాంసం అమ్మకం, సరఫరా, వినియోగాలను నిషేధించడానికి తక్షణం చర్య తీసుకోవాలని కోరింది. కుక్క మాంసం తింటే రాబిస్ వ్యాధి వ్యాపిస్తుందని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.  దీంతో పాటూ సంగీతా గోస్వామి లాంటి ఎన్జీవో సంస్థ నాయకురాలు కూడా దీని మీద ఎన్నో ఏళ్ళుగా పోరాటం సాగించారు. దీంతో నాగాలాండ్, మిజోరాం ప్రభుత్వాలు ఎట్టకేలకు కుక్క మాంసాన్ని నిషేధించాయి. 2020 ఏడాది మార్చి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 

Also Read:TS: తెలంగాణలో భూ ఆక్రమణల నిరోధక చట్టం..ప్రభుత్వం కసరత్తు

జాతీయ జంతువులు, వన్య ప్రాణులు..

ఇక జాతీయ జంతువులు అయిన నెమలి, పులి లాంటి వాటిని తినడం వరకు కాదు వేటాడడమే పెద్ద నేరం. అలాగే జింకలు, లేళ్ళు లాంటి వాటిని కూడా తినడం కొన్నిచోట్ల నేరం. అసలు వనయ ప్రాణులను వేటాడవద్దు, తినవద్దు అని అటు అటవీశాఖ, ఇటు ప్రభుత్వాలు రెండూ చెబుతున్నాయి. వన్య మృగాలను రక్షించుకోవాలని పిలుపునిస్తున్నాయి.

Also Read: బైకుల వెళ్ళే వీలుగా హెజ్బుల్లా బంకర్లు..వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

#india #jagtial #meat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe