/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
Sarpanch Elections
Sarpanch Elections : స్థానిక సంస్థల ప్రక్రియలో భాగంగా మొదట సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఇటీవల సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీల రిజ ర్వేషన్లను ఒకేసారి ప్రకటించి ప్రభుత్వం జాబితాను విడుదల చేసినప్పటికీ కోర్టు ఆంక్షలతో అది రద్దయిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆశావహులంతా ముందుగా సర్పంచ్‌గా పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. అయితే అసలు సర్పంచ్ ను ఎలా ఎన్నుకుంటారు? సర్పంచ్ విధులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో మొదటి అంచె ‘గ్రామ పంచాయతీ’. దీనికి సర్పంచ్ రాజకీయ అధిపతి. సర్పంచ్‌కు పరిపాలనలో సహకరించేందుకు ‘పంచాయతీ కార్యదర్శి’ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతో గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులు నిర్వహించడం చేస్తుంది.
సర్పంచ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1981 నుంచి సర్పంచ్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సర్పంచ్ పదవికి ఇదే తరహాలో ఎన్నిక జరుగుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండి, నమోదైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు.
Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!
అధికారాలు, విధులు: గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
పంచాయతీ ప్రథమ పౌరులుగా వ్యవహరిస్తారు.
పంచాయతీ స్థాయిలో రాజకీయ అధిపతిగా ఉంటారు.
పంచాయతీకి సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తారు.
పంచాయతీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సమాచారం కోరవచ్చు.
పంచాయతీ వార్షిక ఖాతాలను ఏటా క్రమం తప్పకుండా ఆడిట్ చేయించాలి.
పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటారు.
పంచాయతీ చేసిన తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.
తన పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొదలైన కార్యాలయాలను సందర్శించి, పనితీరును పరిశీలిస్తారు.
గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దృష్టికి తీసుకెళ్తారు.
తొలగింపు: సర్పంచ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ప్రభుత్వ చర్యలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తుంది. ఇలా పదవి కోల్పోయిన వారు రెండేళ్ల వరకు సంబంధిత పదవులకు తిరిగి పోటీ చేసే అవకాశం ఉండదు.
సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు. దీనికి కారణం ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచ్‌ని ఎన్నుకోవడం.
సర్పంచ్ పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం కంటే ముందే తన పదవికి రాజీనామా చేయవచ్చు. సర్పంచ్ తన రాజీనామాను పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. అది వీలు కానప్పుడు డీపీఓకి ఇవ్వాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో సర్పంచ్ గ్రామ సభ సమావేశాలను నిర్వహించడంలో విఫలమైతే పదవి కోల్పోతారు. ఆ విధంగా పదవి కోల్పోయినవారు ఏడాది పాటు సంబంధిత పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
ఉపసర్పంచ్: పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అదే రోజు లేదా మరుసటి రోజు ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు చేతులు పైకి ఎత్తి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఉపసర్పంచ్ ఎన్నిక విధానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరోక్షంగానే ఉంటుంది. సర్పంచ్ అందుబాటులో లేని సమయంలో ఉపసర్పంచ్ గ్రామ సభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఉపసర్పంచ్ పదవీకాలం అయిదేళ్లు. పదవీ కాలం కంటే ముందే రాజీనామా చేయవచ్చు. రాజీనామా పత్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కి సమర్పించాలి. ఎంపీడీఓ అందుబాటులో లేకపోతే డివిజినల్ పంచాయతీ ఆఫీసర్ (డీఎల్‌పీఓ)కి ఇవ్వాలి.
అవిశ్వాస తీర్మానం: సర్పంచ్, వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా ఉపసర్పంచ్‌ను తొలగించవచ్చు.
ఏపీలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే పదవి చేపట్టిన తేదీ నుంచి నాలుగేళ్ల తర్వాతే సాధ్యం. అంటే పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తెలంగాణలో పదవి చేపట్టిన తేదీ నుంచి 2 సంవత్సరాల అనంతరం ఈ తీర్మానాన్ని ప్రయోగించవచ్చు. మొత్తం సభ్యుల్లో 2/3 వంతు ఆమోదం తెలిపితే, ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం అమలవుతుంది. అనంతరం ఉపసర్పంచ్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ పదవి నుంచి తొలగిస్తారు.
Also Read: బిగ్‌బాస్ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే
సస్పెండ్ అయిన వార్డు సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఏదైనా కారణం వల్ల ఉపసర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపు ఉపఎన్నిక ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయాలి.
సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు రెండూ ఏకకాలంలో ఖాళీ అయితే వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్‌గా పంచాయతీరాజ్ కమిషనర్ నియమిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి.
పంచాయతీ కార్యదర్శి: సర్పంచ్‌కు పరిపాలనా వ్యవహారాలలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి. ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే మేజర్ గ్రామ పంచాయతీలో అయితే కార్యనిర్వహణాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1, 2002న గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని సృష్టించారు.
పంచాయతీ అధికారాలు - విధులు :
గ్రామ పంచాయతీ అధికారాలు, విధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి
1) ఆవశ్యక విధులు (తప్పనిసరిగా నిర్వహించేవి)
2) వివేచనాత్మక విధులు (ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా నిర్వహించేవి)
ఆవశ్యక విధులు: ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ
కంపోస్టు ఎరువుల తయారీ
బందెలదొడ్ల ఏర్పాటు, నిర్వహణ
పంచాయతీ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ కలరా, మలేరియా, డయేరియా లాంటి అంటువ్యాధుల నివారణ
శ్మశానవాటికల నిర్మాణం, నిర్వహణ
మంచినీటి బావులు, చెరువుల ఏర్పాటు, నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా
పంచాయతీ పరిధిలోని వీధులు, బజార్లలో చెత్త తొలగింపు
డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ
వీధిదీపాల ఏర్పాటు
గ్రామ పంచాయతీ పరిధిలో భవనాలు, వంతెనలు, కట్టడాల నిర్మాణం
Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’
వివేచనాత్మక విధులు: రోడ్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం.
వైద్యశాలల నిర్మాణం, నిర్వహణ
ఆటస్థలాలు, వ్యాయామశాలల నిర్మాణం, నిర్వహణ
వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు.
గ్రంథాలయాలు, ఇతర పఠన మందిరాల నిర్మాణం, నిర్వహణ
ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ ఇంకా మరికొన్ని..
సర్పంచ్ జీతం : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న గౌరవ వేతనాలు 2021వ సంవత్సరంలో పెంచిన మొత్తాలే కొనసాగుతున్నాయి. 2021కు పూర్వం సర్పంచ్‌లకు రూ .5000 మాత్రమే చెల్లించగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రూ.1,500 పెంచి రూ.6,500 చేసింది. ఎంపీటీసీ సభ్యులకు కూడా రూ.6,500 చొప్పున గౌరవ భత్యం అందుతోంది.
Follow Us