Bihar Elections 2025: బీహార్ సీఎం అభ్యర్థి నితీష్ కాదు.. బీజేపీ సంచలన ప్రకటన!

బీహార్‌లో సీఎం అభ్యర్థిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

New Update
Amit Shah Key Comments on Bihar CM Candidate

Amit Shah Key Comments on Bihar CM Candidate

బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. అయితే సీట్ల పంపకాల విషయంలో ఎన్డీయే కూటమిలో విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం అభ్యర్థిపై కూడా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే వీటిపై తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్డీయే కూటమిలో ఎలాంటి మనస్పర్థలు లేవని పేర్కొన్నారు.  

Also Read: 'కచ్చా బాదాం' సింగర్ లైఫ్ ఛేంజ్.. పెద్ద ఇళ్లు, కారు - చూస్తే పిచ్చెక్కిపోతారు..!

సోషల్ మీడియా, మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో కూటమి పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ఇక సీఎం అభ్యర్థిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. '' 2020 ఎన్నికల్లో JDU కన్నా బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఈ సమయంలో నితీశ్‌ కుమార్‌ ప్రధాని మోదీని కలిశారు. 

Also Read: వీడేం భర్త.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపేశాడు.. తర్వాత ఏమైందంటే?

బీజేపీ నుంచే సీఎం ఉండటం మంచిదని నితీశ్ తన అభిప్రాయం చెప్పారు. కానీ మేము మిత్రపక్షాలను ఎప్పటికీ గౌరవిస్తాం. సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఆయన్ని ముఖ్యమంత్రిని చేశామని'' అమిత్ షా అన్నారు. ఇదిలాఉండగా బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 6, 11వ తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈ ఫలితాల్లో ఎన్డీయే గత రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తుందని అమిత్‌ షా అన్నారు. 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా దీని గురించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అయితే సీఎం ఎవరు అనేది ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎన్డీయే, బీజేపీ, జేడీయూ కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటారు. ఒక్కరే ఈ నిర్ణయాన్ని తీసుకోలేరని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని స్పష్టం చేశారు.  దీంతో సీఎం అభ్యర్థిపై క్లారిటీ లేకపోవడంతో బీజేపీ, జేడీయూ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఈసారి కూడా నితీశ్‌ కుమార్‌కే సీఎం బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం వేరేవాళ్లకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు