CCPA: పాకిస్తాన్ జెండాలను అమ్ముతున్న కారణంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు

పాకిస్తాన్ జెండాలు అమ్మినందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ నోటీసులు జారీ చేసింది. వీటితో మరికొన్ని ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లకు కూడా నోటీసులు వెళ్ళాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 

New Update
india

Amazon, Flip kart

పహల్గాం దాడి తరువాత ప్రతీ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటోంది కేంద్రం. పాకిస్తాన్ కు చెందిన ఏ చిన్న కార్యకలాపాలు అయినా వెంటనే యాక్షన్ తీసుకుంటోంది. తాజాగా ఇండియాలోని పలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ కు నోటీసులను ఇచ్చింది కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిల్లో పాకిస్తాన్ జెండాలుతో పాటూ మరికొన్ని సంబంధిత వస్తువులను అమ్ముతున్నారనే ఆరోపణలతో నోటీసులను ఇచ్చినట్టుగా వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉబుయ్ ఇండియా, Etsy, ది ఫ్లాగ్ కంపెనీ మరియు దిఫ్లాగ్ కార్పొరేషన్ లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. పాకిస్తాన్ జెండాలు, ఇతర వస్తువులను మన దేశం లో అమ్మడాన్ని సహించేది లేదని...ఈ కామర్స్ సంస్థలన్నీ వాటిని వెంటనే తమ ఫ్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని చెప్పారు.  ఈ కామర్స్ సంస్థలన్నీ జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. 

 

ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తతలు..

పహల్గాం దాడి తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్యనా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం భారత్, పాక్ రెండు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్యనా ఇంకా ఉద్రిక్తతలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. 

today-latest-news-in-telugu

Also Read: BLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు