Mahakumbh Mela: వక్ఫ్‌ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు : ఆల్ ఇండియా ముస్లిం అధ్యక్షుడు

వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆరోపించారు. తాము భూములు ఇస్తుంటే కుంభమేళాకు రాకుడా ముస్లింలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.

New Update
Maha Kumbh Mela

Maha Kumbh Mela

 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం యోగీ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఉత్సవం ప్రారంభం కానున్న వేళ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి వారం రోజులు సెలవులు

సుమారు 34 ఎకరాల భూమిని హిందూ మతపరమైన కార్యక్రమానికి వినియోగిస్తున్నారని చెప్పారు. అలాగే హిందుయేతరులు కుంభమేళాకు రాకుండా అడ్డుకోవాలని హిందూ సంఘాలు పిలుపునివ్వడాన్ని ఖండించారు. ముస్లింలు భూములు ఇస్తుంటే.. కుంభమేళాకు తమకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడంపై విమర్శలు చేశారు. బరేల్వీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

Also Read: కాంగ్రెస్కు కేసీఆరే గురువు.. రైతు భరోసాకు భరోసానే లేదు : బండి సంజయ్

మరోవైపు బర్వేలీ చేసిన వ్యాఖ్యలను హిందూ నేతలు ఖండించారు. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ దీనిపై మాట్లాడారు. షహబుద్దీన్ రజ్వీ బరేల్వీకి పాకిస్థాన్‌ స్పాన్సర్ చేస్తుందని ఆరోపించారు. అతడు ఉగ్రవాద మనస్తత్వం కలవాడని అన్నారు. కుంభమేళాకు భంగం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్

Also Read: లవర్లకు ఓయో బిగ్ షాక్.. పెళ్లి కాని వారికి ఇక నో రూమ్!

ఇదిలాఉండగా.. కుంభామేళా కోసం రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఈ ఉత్సవంలో పాల్గొనేవారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కపెట్టడంతో పాటు వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించనన్నామని చెప్పారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం 1.6 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 1.5 మరుగుదోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారీ భద్రత కోసం ఇప్పటికే పారామిలటరీ బలగాలతో సహా 50 వేల మంది సిబ్బంది ఆ ప్రాంతంలో మోహరించినట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు