OYO: ప్రేమికులకు 'ఓయో' బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రూమ్స్ బుకింగ్‌లో కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వడం కుదరదని, ఈ రూల్స్ మొదట మేరఠ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
చెక్-ఇన్ పాలసీ..
ఈ కొత్త చెక్-ఇన్ పాలసీలో ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో రూమ్ బుక్ చేసేకునేవారు పెళ్లికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మేరఠ్‌లోని హోటళ్లలో ఈ పద్ధతిని తక్షణమే అమల్లోకి తీసుకురాబోతున్నట్ల తెలిపింది. ఇక్కడ రూల్స్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాల్లోనూ ప్రవేశపెడతామని ఓయో మెనేజ్ మెంట్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: TG News: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
సెఫ్టీ అందించే విధంగా..
'గెస్టులకు ఓయో బాధ్యతాయుత, సురక్షితమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది' అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ఫ్యామిలీస్, స్టూడెంట్స్, ఒంటరిగా వచ్చే ప్రయాణికులకు సెఫ్టీ అందించే విధంగా వసతులు కల్పించేందుకు కొత్త చెక్ -ఇన్ పాలసీ తీసుకొచ్చాం. మరింతమంది కస్టమర్స్, బుకింగ్స్ పెంచేందుకు తాము తీసుకొస్తున్న రూల్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Girls Hostel: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ ఇష్యూ.. వెలుగులోకి సంచలనాలు!