Comparitech Company: ఈ పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే ఇక అంతేపని.. హ్యాకర్ల చేతికి తాళం ఇచ్చేస్తుండ్రు!

2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నెట్‌లో అత్యంత సాధారణంగా ఉపయోగించిన పాస్‌వర్డ్‌ల జాబితాను కంపారిటెక్ అనే సంస్థ విడుదల చేసింది. 200 కోట్లకు పైగా లీకైన పాస్‌వర్డ్‌లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

New Update
most commonly used passwords

సైబర్ భద్రత గురించి ఎన్ని హెచ్చరికలు ఉన్నా, ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికీ బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని మరోసారి స్పష్టమైంది. 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నెట్‌లో అత్యంత సాధారణంగా ఉపయోగించిన పాస్‌వర్డ్‌(most used passwords)ల జాబితాను కంపారిటెక్ అనే సంస్థ విడుదల చేసింది. 200 కోట్లకు పైగా లీకైన పాస్‌వర్డ్‌లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. కామన్ పాస్‌వర్డ్స్ పెట్టుకొని దొంగ చేతికి తాళం ఇస్తున్నారు చాలామంది యూజర్లు.

ఈ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉపయోగించిన పాస్‌వర్డ్(common password) వరుసగా మరోసారి "123456" అని తేలింది. ఈ ఒక్క పాస్‌వర్డ్‌నే దాదాపు 7.6 మిలియన్ల మందికి పైగా ఉపయోగించినట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో మొదటి పది స్థానాల్లో ఉన్నవి అన్నీ సులభంగా ఊహించగలిగేవి కావడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read :  ఒప్పో నుంచి ఊరమాస్ ఫోన్లు.. 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్లు..!

టాప్ 10 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు (2025):

123456
12345678
123456789
admin
1234
Aa123456
12345
password
123
1234567890

Also Read :  చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 2500GB డేటా, 600కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఫ్రీ..!

భారతదేశానికి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లు:

సాధారణ పాస్‌వర్డ్‌లలో కొన్ని ప్రాంతీయ లేదా దేశానికి సంబంధించిన పేర్లు కూడా చేరాయి. భారతీయ వినియోగదారులు తరచుగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో 'India@123' అనేది 53వ స్థానంలో నిలిచింది. ఇది సంఖ్యలు, అక్షరాలు, ప్రత్యేక అక్షరాల కలయిక అయినప్పటికీ, దీనిని సులభంగా క్రాక్ చేయవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంఖ్యల ఆధిపత్యం: టాప్ 1,000 పాస్‌వర్డ్‌లలో దాదాపు నాలుగో వంతు (25%) కేవలం సంఖ్యలతో కూడినవే. దాదాపు 65.8% పాస్‌వర్డ్‌లు 12 అక్షరాల కంటే తక్కువ నిడివి కలవి. ఈ బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఆధునిక హ్యాకింగ్ టూల్స్ కొన్ని సెకన్లలోనే ఛేదించగలవు.

సైబర్ దాడులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లను తక్షణమే మార్చుకోవాలని, కనీసం 12 అక్షరాలు ఉండే, అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక గుర్తులు కలిపిన బలమైన పాస్‌వర్డ్‌లు మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు