IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18 షెడ్యూల్ రిలీజైంది. ఈ మెగాటోర్నీ మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ అనంతరం వెల్లడించిన ఆయన ఫైనల్ మ్యాచ్ మే25న జరగనున్నట్లు తెలిపారు.

author-image
By srinivas
New Update
ipl2025

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ షెడ్యూల్ రిలీజైంది. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు. ఇక ఐపీఎల్ 2025 మార్చి 14 నుంచి ప్రారంభమవుతుందని గతంలో బీసీసీఐ ప్రకటించింన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ తేదిని సవరించి షెడ్యూల్ విడుదల చేశారు.ప్లేఆఫ్స్, ఫైనల్ తేదీలను వెల్లడించలేదు. కానీ మే 25న ఫైనల్  జరగనున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్.. 

ఈ మేరకు ఆదివారం ముంబైలో జరిగిన బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ తర్వాత శుక్లా ఈ విషయాన్ని ప్రకటించారు. మార్చి 14 నుంచి షెడ్యూల్ 23కి మార్చినట్లు చెప్పారు. మార్చి 23 నుంచి మే 25 వరకు ఈ టోర్నీ జరుగనున్నట్లు తెలిపారు. ఇక  పంజాబ్ -ఢిల్లీ మధ్య తొలి మ్యాచ్‌ ఫైట్ జరగనుండగా.. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. మొత్తం ఈసీజన్ లో 10 టీమ్స్ పాల్గొంటుండగా ఈసారి ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో, శ్రేయాస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ దక్కించుకున్నాయి.  ఈ సమావేశంలోనే దేవజిత్ సైకియా బీసీసీఐ కొత్త కార్యదర్శిగా, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఎన్నికయ్యారు. జై షా, ఆశిష్ షెలార్ ఖాళీ చేసిన స్థానాలకు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వెంకటేష్ అయ్యర్‌ను KKR రూ. 23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. తద్వారా అతను IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపికకు సంబంధించిన సమావేశం జనవరి 18 లేదా 19 తేదీల్లో జరుగుతుందని శుక్లా చెప్పారు. నివేదికల ప్రకారం ICCకి తాత్కాలిక స్క్వాడ్‌లను పంపడానికి గడువు జనవరి 12. కానీ ఇప్పటి వరకు, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో సహా మూడు జట్లు మాత్రమే టోర్నమెంట్ కోసం తమ జట్టులను ప్రకటించాయి.

Advertisment
తాజా కథనాలు