/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-12-17-57.jpg)
Ajit Pawar
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య రావడంతో ప్రమాదం జరిగి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అజిత్ పవార్ చార్టర్డ్ విమానంలో బయలు దేరారు. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో ఐదురుగు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు అజిత్ పవార్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/28/screenshot-2026-01-28-121719-2026-01-28-12-18-30.jpg)
ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం
పంజాబ్ కేసరి పోస్ట్..
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, 'పంజాబ్ కేసరి' లాలా లజపతిరాయ్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. "దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన లాలా లజపతిరాయ్ గారి దేశభక్తి మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం" అని మరాఠీలో పోస్ట్ చేశారు. ఉదయం 8:57 గంటలకు ఈ పోస్ట్ చేశారు. అయితే అజిత్ పవార్ పీఆర్ సిబ్బందికి చెప్పడంతో వారు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఈ విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పోస్ట్‌కు కొన్ని నిమిషాల ముందు లేదా తర్వాత ఈ విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'
Follow Us