Maharashtra Dada Ajit Pawar: మహారాష్ట్ర దాదాగా అజిత్ పవార్.. ఎందుకు ఇలా పిలుస్తారంటే?

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ తనదైన మార్క్ వేసుకున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు డిప్యూటీ సీఎంగా పార్టీని ముందుకు నడిపించడంలో అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారు. అందులో మహారాష్ట్ర రాజకీయాల్లో అతన్ని అందరూ అజిత్ దాదా అని పిలుస్తుంటారు.

New Update
Ajit pawar

Ajit pawar

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ తనదైన మార్క్ వేసుకున్నారు. అక్కడ అతన్ని అజిత్ పవార్ కంటే మహారాష్ట్ర దాదాగానే పిలుస్తుంటారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో కీలక నేతగా, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందరూ ఆయన్ని ప్రేమగా, గౌరవంగా 'దాదా' అని పిలుస్తుంటారు. మరాఠీ భాషలో 'దాదా' అంటే 'అన్న' అని అర్థం. అయితే ఆయనను అలా పిలవడానికి కేవలం వయసు మాత్రమే కారణం కాదు.. వ్యక్తిత్వం, పనితీరు కూడా ఓ కారణమే. అజిత్ పవార్ ఏ విషయాన్ని అయినా కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం

దాదా అనే ఎందుకంటే?

ఏదైనా విషయం నచ్చకపోయినా లేదా తప్పు అనిపించినా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేస్తారు. రాజకీయాల్లో చాలామంది దౌత్యపరంగా వ్యవహరిస్తారు.. కానీ అజిత్ పవార్ మాత్రం నిక్కచ్చిగా ఉంటారు. ఆయన మాటల్లో కఠినం ఉన్నా, అందులో నిజాయితీ ఉంటుందని ప్రజలు నమ్మకం. అతనికి ఉన్న రాఫ్ అండ్ టఫ్ స్వభావమే దాదా అనే పేరును తెచ్చిపెట్టింది. పాలన విషయంలో కూడా కఠినంగా ఉంటారు. యువత, గ్రామీణ ఓటర్లలో అజిత్ పవార్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు డిప్యూటీ సీఎంగా పార్టీని ముందుకు నడిపించడంలో అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారు. అందులో మహారాష్ట్ర రాజకీయాల్లో అతన్ని అందరూ అజిత్ దాదా అని పిలుస్తుంటారు.

ఇది కూడా చూడండి: Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం.. కారణమిదే?

Advertisment
తాజా కథనాలు