/rtv/media/media_files/2025/02/10/Qlncz2EFT8jnTbisRwEa.jpg)
Air show in Bengaluru
బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా ఎయిర్ షో సోమవారం ప్రారంభమైంది. తొలిసారిగా ఈ ఎయిర్ షోలో అత్యాధునిక 5వ జనరేషన్ యుద్ధ విమనాలను ప్రదర్శించారు. అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటనింగ్-2, రష్యాకు చెందిన సుఖోయ్-57 యుద్ధ విమానాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ రక్షణ సహకారంలో ఇది ఓ మైలురాయిగా నిలవనుందని నిపుణులు అంటున్నారు.
#WATCH | Bengaluru, Karnataka: Su-57 from Russia performs manoeuvres at #AeroIndia2025, enthralling the onlookers. pic.twitter.com/YpGfM88164
— ANI (@ANI) February 10, 2025
Also Read: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!
అయితే యలహంక ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-57 యుద్ధ విమానం టేకాఫ్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ విమానంలో ఉన్న పైలెట్ ఏరోబాటిక్ విన్యాసం చేశాడు. వర్టికల్‌గా అతను యుద్ధ విమానాన్ని నడిపిన తీరు అందిరినీ మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఇక అమెరికాకు చెందన ఫైటర్-35 లైటనింగ్‌తో సహా బీ-1బీ లాన్సర్ సూపర్‌సోనిక్ స్ట్రాటజిక్ బాంబర్‌ను కూడా ఈ ఏయిర్ షోలో ప్రదర్శించనున్నారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ఉన్న పైలట్ యలహంక ఎయిర్ బేస్ పైనుంచి ఓ సెల్ఫీ దిగాడు. కాక్‌పిట్ నుంచి 5వ జనరేషన్ విమానంలో ఎయిర్‌బేస్ ఎలా కనిపిస్తుందో ఆ ఫొటోను చూపించాడు.
Just a normal day at Aero India....
— Vayu Aerospace Review (@ReviewVayu) February 10, 2025
10 minutes ago, it was the Su-57...and now the F-35💕🔥💕🔥
Just how lucky are we attending this spectacle!✌️✌️✌️ pic.twitter.com/5CJbhS47EE
Yelahanka runway as viewed from the cockpit of Su-57. Photo via UAC TC pic.twitter.com/RnRulfRq2Q
— Vijainder K Thakur (@vkthakur) February 9, 2025
Also Read: పేరెంట్స్ సె**క్స్ పై ప్రశ్న దుమారం.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్!
ఇదిలాఉండగా అమెరికా, రష్యాలో రక్షణ రంగం బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు దేశాలు తమ డిఫెన్స్ ఉత్పత్తులను ఆసియా దేశాల్లో అమ్మేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాము రూపొందించిన అత్యాధునిక యుద్ధ విమానాలను ఈ ఎయిర్ షోలో ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఈ ఎయిర్ షో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరగనుంది.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే
Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్