Earth Quake: టర్కీలో భారీ భూకంపం..29 మందికి తీవ్ర గాయాలు

టర్కీలోని బలికెసిర్ ప్రావిన్స్ లో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో ఒక యువకుడు మృతి చెందగా మరో 29 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

New Update
turky earth quake

Earth Quake In Turky

ఆదివారం టర్కీలో తీవ్ర విషాదం నింపింది. అక్కడ బలికెసిర్ ప్రావిన్సులో 61. తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని కారణంగా 200 కి.మీ దూరంలో ఉన్న ఇస్తాంబుల్ లోనూ భూమి కంపించింది. మరోవైపు భూకంపం తాకిడికి సిందిర్గి నగరంలో దాదాపు 16 భవనాలు కూలిపోయాయి. వీటి కింద అనేక మంది చిక్కుకుపోయారు. వీరిలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో 29 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింపు..

శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ బృందం కృషి చేస్తున్నారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి, చీకటి కారణంగా రెస్క్యూ చేయడం కష్టం అయింది. 

Advertisment
తాజా కథనాలు