Air India Flight Crash: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్‌కు 8 షాకింగ్ కారణాలివే!

అమ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఇంజన్ ఫెయిల్ అవ్వడమో, ఫక్షులు ఢీకొట్టడమో, పైలట్ తప్పిదమో అయి ఉండవచ్చు. ఫ్లైట్ టేకాఫ్ సమయం చాలా కీలకం. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన మొత్తం విమాన ప్రమాదాల్లో 35 శాతం టేకాఫ్ టైంలోనే సంభవించాయి.

New Update
Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

Air India Flight Crash: గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో మ‌ృతుల సంఖ్య 270కి చేరుకుంది. చిన్న తప్పిదం ఇంతమంది ప్రాణాలు బలితీసుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 787 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఈ ఘోర ప్రమాదాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయో లేదా జరిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

టేకాఫ్ అత్యంత కీలకం

విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయం చాలా కీలకం. పైలట్ చిన్న తప్పిదం చేసినా వందల ప్రాణాలు గాల్లో నుంచి గాల్లోనే కలిసిపోతాయి. ప్రపంచంలోని అన్ని విమాన ప్రమాదాలలో దాదాపు 35 శాతం టేకాఫ్ చేసేపట్టుడే జరిగాయి. టేకాఫ్ తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్ అవడానికి అవకాశం తక్కువ. భారీ విమానం అత్యంత వేగంగా గాల్లోకి ఎగరాలంటే పైలట్ రన్‌వే, ఇంజిన్, వాతావరణం, విమానంపై ఎంత  గరిష్ట ఒత్తిడి ఉందని గమనించకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఫ్లైట్ గాల్లోకి ఎగరడానికి ఫ్లాప్‌లు చాలా ముఖ్యం. విమానం గాల్లోకి ఎగిరేటప్పుడు ఫ్లాప్‌లు ఫెయిల్ అయితే అది తీవ్రమైన సమస్య. దీనివల్ల విమానం కూలిపోయే ప్రమాదం ఉంది. ఫ్లాప్‌లు అంటే విమానం రెక్కల వెనుక భాగంలో ఉండే భాగాలు, ఇవి టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఉపయోగపడతాయి. ఇవి విమానం ఎగరడానికి అవసరమైన లిఫ్ట్‌ను పెంచడానికి సహాయపడతాయి. ఒకవేళ ఫ్లాప్‌లు సరిగ్గా పనిచేయకపోతే విమానం గాల్లో ఎగరడానికి అవసరమైన పవర్ అందదు. దీంతో గాలోనే ఫ్లైట్ అదుపు తప్పుతుంది. 

Also Read: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన

ఇంజిన్ వైఫల్యం

టేకాఫ్ సమయంలో ఇంజిన్ గరిష్ట సామర్థ్యంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పక్షి ఢీకొనడం, ఫ్యూయల్ సరిగా అందక పోవడం వంటివి జరిగితే సాంకేతిక లోపం వెంటనే ప్రమాదానికి కారణమవుతుంది. విమానం టేకాఫ్​అయిన వెంటనే 2 ఇంజన్లూ ఒకేసారి ఫెయిల్ కావడం అనేది అరుదు. కానీ తాజా ప్రమాదంలో అదే గనక జరిగి ఉంటే.. ఈ విమానం గాలిలో ఎలాంటి థ్రస్ట్ (ముందుకు తోసే ఫోర్స్) లేని ఒక గ్లైడర్ (ఇంజన్లు ఉండని పొడవాటి రెక్కల విమానం)లా అయిపోయి ఉంటుంది. ఇంజన్ పవర్ లేకపోవడంతో ల్యాండింగ్ గేర్లను పైలెట్లు రిట్రాక్ట్ చేయలేకపోయి ఉంటారు. ఫలితంగా విమానంపై డ్రాగింగ్ ప్రభావం పెరిగి వేగంగా స్పీడ్​ను కోల్పోయి గాలిలో ఆగిపోయినట్లు అయి ఉంటుంది. అంత తక్కువ ఎత్తులో విమానం స్తంభించిపోవడంతో రెండు ఇంజన్లలో సమస్యలను గుర్తించి, సాల్వ్ చేసేందుకు గానీ,  ఇంజన్​ను రీస్టార్ట్ చేసేందుకు గానీ పైలెట్లకు టైం లేకపోయి ఉంటుంది. 

టేకాఫ్ ఫ్లాప్స్ రాంగ్ పొజిషన్​లో ఉండటం 

సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు దాని రెక్కలపై చివరలో ఉండే ఫ్లాప్స్ (కదిలే రేకుల వంటివి) పొజిషన్ అనేది కీలకం అవుతుంది. టేకాఫ్​అయ్యేటప్పుడు ఇవి రెక్క నుంచి ముందుకు ఎక్స్ టెండ్ అవ్వాలి. అప్పుడు రెక్క విస్తీర్ణం పెరిగి, విమానం తక్కువ స్పీడ్ లో ఉన్నా లిఫ్ట్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాప్స్ ను తిరిగి యథాస్థానానికి రిట్రాక్ట్ చేస్తే.. విమానం క్లైంబ్ అవుతుంది. అయితే, ఈ ప్రమాద సమయంలో డ్రీమ్ లైనర్ టేకాఫ్​అవుతున్నప్పుడు ఫ్లాప్స్ రిట్రాక్ట్ అయి ఉన్నట్టుగానే వీడియోలను బట్టి తెలుస్తోంది. ఇంజన్ ఫెయిల్ వంటి తీవ్ర ఒత్తడితో కూడిన సమయంలో పైలట్ ఒకవేళ పొరపాటుగా ల్యాండింగ్ గేర్ ను రిట్రాక్ట్ చేయడానికి బదులుగా ఫ్లాప్స్ ను ఉపసంహరించినట్టయితే.. విమానం ఎత్తు(లిఫ్ట్)కు వెళ్లడాన్ని గణనీయంగా తగ్గించి ఉంటుంది. ప్రధానంగా ఒకే ఇంజన్ పని చేస్తున్న సమయంలో ఇలా జరిగితే విమానం దాదాపుగా స్తంభించిపోతుంది.

ఇంధనం కలుషితం కావడం 

అమహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌కు ఇంధన కాలుష్యం కూడా ఓ కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది రెండు ఇంజిన్లలో థ్రస్ట్ లాస్ లేదా విద్యుత్ వైఫల్యానికి దారితీయవచ్చని ఏవియేషన్ రంగంలో ఓ నిపుణుడు సూచించారు. ఇంధనం కలుషితమైతే రెండు ఇంజిన్లు ఒకే సారి ఆగిపోతాయి. లండన్ చేరుకోవడానికి దానిలో 35 టన్నుల కంటే ఎక్కువ ఇంధనం ఉన్నందున అది క్రిందికి దిగి పడిపోయింది. దీంతో ఫ్లైట్‌లో వాడే Jet A-1 బ్లాస్ట్ అయ్యింది. 

Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!

ఒకటి కన్నా ఎక్కువ పక్షులు ఢీకొట్టాయా?

పక్షులు వలస వెళ్లే సమయంలో గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఓ పక్షి లేదా వాటి గుంపు ఫ్లైట్ ఢీకొడితే విమానం రెండు ఇంజిన్లు శక్తికి కోల్పోయి ఉండొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజీలో కనపిస్తోందని చెబుతున్నారు.

పైలట్ మిస్టేక్?

టేకాఫ్ సమయంలో పైలట్ వేగం, రన్‌వే లిఫ్ట్-ఆఫ్ పాయింట్‌ను సరిగా అంచనా వేయకపోతే ప్రమాదాలు జరుగుతాయి. టేకాఫ్‌, ల్యాండింగ్ సమయంలో పైలట్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోయినా.. ఏ చిన్న తప్పిదం చేసినా ఇలాంటి పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విమానం 400 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయినట్టు గుర్తించిన పైలట్లు.. పొరపాటుగా దానికి బదులుగా పని చేస్తున్న ఇంజన్​ను షట్ డౌన్ చేసి ఉండొచ్చు. ఇలాంటి పొరపాట్లు విమానయాన చరిత్రలో అనేకం జరిగాయి.

వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడం

విమాన ప్రమాదాలలో ఉరుములు, బలమైన గాలి, పైలట్‌కు సరిగా కనిపించకపోవడం లేదా టేకాఫ్ సమయంలో మైక్రో బర్స్ట్ వంటి అంశాలు కూడా ప్రమాదాలకు కారణమవుతాయి. ఇటీవల వాతావరణ పరిస్థితులు సరిగా లేక ఢిల్లీలో చిక్కుకున్న విమానం వీడియో వైరల్ అయ్యింది. 

ఒక ఇంజన్ ఫెయిల్, ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేయకపోవడం..

విమానం రన్ వేను దాటి, టేకాఫ్ అయిన వెంటనే ఒక ఇంజన్ ఫెయిల్ అవడమో లేదా పక్షి ఢీకొట్టి ఉండొచ్చు. ఈ సమస్యతో పైలెట్, కోపైలెట్ వాళ్ల ఫోకస్ మొత్తం ఇంజన్ మీద పెట్టి ఉంటారు. ఇదే సమయంలో పొరపాటుగా ల్యాండింగ్ గేర్లను రిట్రాక్ట్ చేయడం మరిచిపోయే ఛాన్స్ ఉంది. దీంతో విమానం సింగిల్ ఇంజన్ స్పీడో జీరోకు చేరినట్లు భావిస్తున్నారు. 400 అడుగుల ఎత్తులో అలా స్తంభించిపోయిన విమానాన్ని రికవరీ చేయడం పైలెట్లకు అసాధ్యమనే చెప్పాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు