Ahmedabad : అదేం కొట్టుడురా అయ్యా..! దొంగతనానికి వచ్చిన మహిళకు 20 సెకన్లలో 17 చెంపదెబ్బలు

చూపులన్నీ మెరిసే నగలు, చేతిలో మాత్రం రహస్యంగా దాచిన కారంపొడి ప్యాకెట్! ప్లాన్ సిద్ధమైంది. ఒక్కసారిగా ఆ ప్యాకెట్‌ను దుకాణ యజమాని కళ్లల్లోకి విసిరి.. కళ్లు బైర్లు కమ్మిన ఆ చీకట్లో బంగారం ఎత్తుకెళ్లాలని ఆశించింది. కానీ, ఆమె పన్నాగం ఫలించలేదు.

New Update
gold

అది మామూలు మధ్యాహ్నం అనుకుంది ఆ మహిళ. కస్టమర్‌గా లోపలికి నడుచుకుంటూ వెళ్లింది... చూపులన్నీ మెరిసే నగలు, చేతిలో మాత్రం రహస్యంగా దాచిన కారంపొడి ప్యాకెట్! ప్లాన్ సిద్ధమైంది. ఒక్కసారిగా ఆ ప్యాకెట్‌ను దుకాణ యజమాని కళ్లల్లోకి విసిరి.. కళ్లు బైర్లు కమ్మిన ఆ చీకట్లో బంగారం ఎత్తుకెళ్లాలని ఆశించింది. కానీ, ఆమె పన్నాగం ఫలించలేదు. కత్తి కంటే వేగంగా స్పందించిన ఆ యజమాని... కళ్లలో మంటను పక్కనపెట్టి, పట్టిన పట్టు వదలకుండా ఆమెపై తిరగబడ్డాడు. ఆ తర్వాత జరిగింది కేవలం 20 సెకన్ల వ్యవహారం. దొంగతనం చేయడానికి వచ్చిన ఆ సాహసికి.. మిర్చిపొడి మంట కంటే ఎక్కువ మంట పుట్టించేలా, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు చెంపదెబ్బలతో యజమాని గుణపాఠం చెప్పాడు. 

Also Read :  నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ!

గుజరాత్(gujarat) రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఒక నగల దుకాణంలో విచిత్రమైన దొంగతనం యత్నం(rob jeweller) విఫలమైంది. నగలు కొనేందుకు వచ్చిన కస్టమర్‌గా నటిస్తూ దుకాణదారుడి కళ్లలో కారంపొడి కొట్టేందుకు ప్రయత్నించిన ఓ మహిళకు, అతడి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

రాణిప్ ప్రాంతంలో నగల దుకాణం నడుపుతున్న యజమాని సోని వద్ద ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నగల దుకాణంలోకి వచ్చిన మహిళ, కొద్దిసేపు యజమానితో మాట కలిపింది. దుకాణంలో ఎవరూ లేకపోవడాన్ని గమనించి, తన బ్యాగులో దాచుకొచ్చిన కారంపొడిని ఒక్కసారిగా యజమాని కళ్లల్లో కొట్టేందుకు ప్రయత్నించింది. అయితే, యజమాని సోని చాకచక్యంగా పక్కకు తప్పుకోవడంతో కారంపొడి అతడి కళ్లల్లో పడలేదు. దీంతో ఆగ్రహం చెందిన సోని, వెంటనే ఆ మహిళను పట్టుకున్నాడు. ఏకంగా 20 సెకన్లలో 17 సార్లు ఆమె చెంపపై కొట్టాడు. ఈ దాడిని తట్టుకోలేకపోయిన మహిళ, దెబ్బలు తింటూనే దుకాణంలో నుంచి పారిపోయింది.

Also Read :  స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా

దొంగతనం విఫలమైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాణిప్ పోలీసులు రంగంలోకి దిగారు. దుకాణ యజమాని సోని నుంచి ఫిర్యాదు అందుకోనప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆ మహిళ వెనుక ఇంకెవరి పాత్రైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి, కారంపొడి, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఉపయోగించి దొంగతనాలకు పాల్పడటం గతంలో అనేక చోట్ల నమోదైంది. అయితే, ఈసారి యజమాని అప్రమత్తత వల్ల చోరీ యత్నం పూర్తిగా విఫలమైంది.

Advertisment
తాజా కథనాలు