BREAKING: షాకింగ్ న్యూస్.. అహ్మదాబాద్ TO లండన్.. డేంజర్‌లో మరో Air India Flight

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందే మరొక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 159లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా ఆ విమానాన్ని రద్దు చేశారు. ఇటీవలి ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లే మొదటి విమానం ఇదే.

New Update
Air India flight Technical issue

Air India flight Technical issue

BREAKING: అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(air india flight crash) ఇప్పటికీ కళ్లముందే తిరుగుతోంది. క్షణాల్లో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విమానాన్ని నడిపే పైలట్లు ‘మేడే మేడే మేడే’ అని మూడు సార్లు కోడ్ చెప్పినా ఫలితం లేకపోయింది. విమానం బిజే మెడికల్ కాలేజీ & హాస్టల్ మెస్‌ను ఢీ కొట్టడంతో వందల మంది ప్రయాణికులు, పదుల సంఖ్యలో మెడికల్ స్టూడెంట్స్ మరణించారు. వీరితో పాటు సమీపంలో ఉన్నవారు సైతం విమానం బ్లాస్టింగ్‌కు కాలిబూడిదయ్యారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 279కి చేరింది. 

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

Air India flight Technical issue

ఇది మరువక ముందే ఇప్పుడు మరో ఎయిర్ ఇండియా ఫైట్ డేంజర్‌లో పడింది. జూన్ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా AI 171 ఫ్లైట్ ప్రమాదం తర్వాత ఇవాళ అహ్మదాబాద్ నుండి లండన్‌కు మరో ఎయిర్ ఇండియా AI 159 ఫ్లైట్ బయల్దేరడానికి సిద్ధమైంది. దీనిని ప్రమాదం జరిగిన విమానం ప్లేస్‌లో భర్తీ చేశారు. అందువల్ల ఈ ఫ్లైట్ అదే లోకేషన్ నుండి, అదే లైన్‌లో, అదే గమస్థానానికి చేరుకోవడానికి రెడీ అయింది. ఈ తరుణంలో ఈ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా ఆ విమానాన్ని రద్దు చేశారు. కాగా ఇటీవలి ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లే మొదటి విమానం ఇదే కావడం గమనార్హం.

Also Read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Also Read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

మరో ఎయిర్ ఇండియా విమానంలోనూ ఇష్యూ

దీంతోపాటు తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయికి వెళ్తున్న ఎయిరిండియా విమానం (ఏఐ180) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముంబయికి వెళ్తున్న ఎయిరిండియా విమానం సోమవారం అర్థరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా కారణాలతో ప్రయాణీకులను విమానం నుంచి దించేశారు. అనంతరం మరమ్మత్తులు చేపట్టారు.

ఇటీవల మరో ఘటన

ఇది మాత్రమే కాకుండా జూన్ 15న మరో ఇన్సిడెంట్ జరిగింది. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణీకులు గంటల తరబడి ఏసీ లేకుండా కూర్చున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళా ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రకారం.. విమానంలో ఏసీ లేకుండా ఉండటాన్ని చూడవచ్చు. ఆ మహిళ చిన్న పేపర్‌తో గాలి విసురుకున్నట్లు కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సైతం వైరల్ గా మారింది. 

Also Read:అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి

బాంబు బెదిరింపులు

మంగళవారం కొచ్చి నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు  కాల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 

ఇండిగో విమానం 6E 2706 కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఉదయం 9.20 గంటలకు బయలుదేరింది. అనంతరం ఇది గాల్లో ఉండగానే బాంబు బెదిరింపు కాల్ అందింది. దీంతో నాగ్‌పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. ఆపై ప్రయాణీకులందరినీ విమానం నుండి దింపి సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని నాగ్‌పూర్ డీసీపీ లోహిత్ మతాని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు