కొత్త సంవత్సరం మొదటి రోజే ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. ఈ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. తన తల్లి, చెల్లెళ్లను చంపడానికి గల కారణాలను ఆ నిందితుడు అర్షద్ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. తన చెల్లెళ్లను కొందరు ఇతరులకు అమ్మేయాలని చూస్తున్నారని.. అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని తెలిపారు. ఈ మేరకు విడుదలైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!
వీడియో ప్రకారం.. పొరుగున్న కొందరు వ్యక్తుల నుంచి తమకు వేధింపులు వచ్చాయన్నాడు. దాని కారణంగానే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లను చంపేసినట్లు తెలిపాడు. కాగా తమ ఇల్లు కబ్జా చేయాలని కొందరు చూశారని.. వారిని అడ్డుకునేందుకు తాను తన తండ్రి ఎంతో కష్టపడ్డామని అన్నాడు.
Breaking News🚨
— The Delhi Dialogues (@DelhiDialogues6) January 1, 2025
Man Murders Mother and 4 Sisters After Serving Alcohol.
A 24-year-old man in Uttar Pradesh has allegedly murdered his mother and four sisters at a hotel in Lucknow over a family dispute, after serving them alcohol and intoxicating food on Tuesday, police said.… pic.twitter.com/zoJbqNCW8O
15 రోజులుగా చలిలో తిరిగామని.. ఫుట్‌పాత్ మీదే నిద్రపోతున్నామని అన్నాడు. తమ ఇంటి పత్రాలు తమవద్దే ఉన్నా.. సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లకు మొదట విషం పెట్టి ఆ తర్వాత చేతి మణికట్టు నరాలు కోసి.. ఊపిరాడకుండా చేసి చంపినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాలను వీడియోలో చూపించాడు.
అలాగే తమ కుటుంబ పరిస్థితికి కారణమైన కొందరి పేర్లను కూడా చెప్పుకొచ్చాడు. తమను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వారంతా లాండ్ మాఫియాలో భాగం అని అన్నాడు. తన తండ్రిని, తనను తప్పుడు కేసులో ఇరికించి.. ఆ తర్వాత తన చెల్లెళ్లను ఇతరులకు అమ్మేయాలనుకున్నారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
Also Read: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
తమ చెల్లెళ్లను హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతుంటే చూస్తూ ఉండాలా? అని అన్నాడు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదనే.. తల్లి చెల్లెళ్లను చంపేశా అని చెప్పుకొచ్చాడు. ఉదయం అయ్యే సరికల్లా తాను కూడా బతికి ఉండకపోవచ్చన్నాడు. తాను చనిపోయిన తర్వాత ఇంటి స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించాలని కోరాడు. అలాగే ఇంట్లోని వస్తువులను అనాథాశ్రమానికి ఇవ్వాలని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
అసలు ఏం జరిగిందంటే?
ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాలతోనే నిందితుడు.. ఐదుగుర్ని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆగ్రాకు చెందిన అర్షద్ (24) తన తల్లి అస్మా, నలుగురు చెల్లెళ్లు అలీషా (19), రహ్మీన్ (18), అక్సా (16), అలియాలు తినే ఆహారంలో విషం కలిపి, తర్వాత చేతి మణికట్టుపై కత్తితో కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.
నకా ప్రాంతంలోని హోటల్ శరణ్‌జిత్‌లో బాధిత కుటుంబం డిసెంబరు 30న దిగినట్టు వివరించారు. తల్లి సహా ఐదుగుర్ని హత్యచేసిన అర్షద్.. అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. లక్నో డీసీసీ రవీనా త్యాగి మాట్లాడుతూ.. ‘నిందితుడ్ని అర్షద్ (24)గా గుర్తించారు. కుటుంబంలోని ఐదుగుర్ని హత్య చేశాడు.. అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడిన నిందితుడ్ని స్థానిక పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు’ అని చెప్పారు. ఘటనా స్థలికి ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని.. ఆధారాలు సేకరిస్తున్నారని వివరించారు.