/rtv/media/media_files/2025/07/30/the-sacred-relics-of-the-buddha-2025-07-30-19-27-31.jpg)
The sacred relics of the Buddha
Piprahwa Relics : బ్రిటిష్ పరిపాలన కాలంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలు127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా మోదీ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిపర్‌హవా ప్రాంతంలో 1898లో చేపట్టిన తవ్వకాల్లో ఈ పవిత్ర అవశేషాలు బయటపడ్డాయి. ఆ అవశేషాలను.. వలస పాలన సమయంలో బ్రిటీష్ వారు మన దేశం నుంచి వారి దేశానికి తరలించారని మోదీ గుర్తు చేశారు.
ఇది కూడా చూడండి:TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
‘‘బుద్ధుని పవిత్ర ‘పిపర్‌హవా’ అవశేషాలు 127 ఏళ్ల తర్వాత తిరిగి మన భారత్‌కు తీసుకురావడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం అని ఆయన పేర్కోన్నారు. గౌతమ బుద్ధుడు, ఆయన బోధనలతో దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషాలు చాటిచెబుతాయి. అదేవిధంగా అద్భుతమైన సంస్కృతిని పరిరక్షించడం పట్ల మన నిబద్ధతను ఇవి చాటుతాయి. అయితే ఈ అవశేషాలు 1898లో వెలుగులోకి వచ్చాయి. కానీ.. బ్రిటీష్ వలసపాలనలో మనదేశం నుంచి వేరే ప్రాంతానికి వాటిని తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో అవి దర్శనమిచ్చాయి. దీంతో వాటిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఇందులో భాగమైన వారందరికి అభినందనలు’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే!
కాగా పిపర్‌హవా ప్రాజెక్టు వెబ్‌సైట్ లో ఉన్న వివరాల ప్రకారం.. 1898లో ఉత్తరప్రదేశ్‌లో భారత్- నేపాల్ సరిహద్దు సమీపంలో ఉన్న పిపర్‌హవాలో ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయల్పడ్డాయి. ఇందులో గౌతమ బుద్ధునికి చెందినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు, పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. వాటిని బౌద్ధులకు పంపిణీ చేసేందుకుగానూ.. ఆ పవిత్ర అస్థి అవశేషాలను సియామ్ (ప్రస్తుత థాయ్‌లాండ్) రాజుకు అప్పగించినట్లు వెబ్‌సైట్ వివరించింది. అప్పట్లో అవశేషాలను ఉంచిన ఆ పెద్ద రాతి పెట్టె ప్రస్తుతం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉందని పేర్కొంది.
A joyous day for our cultural heritage!
— Narendra Modi (@narendramodi) July 30, 2025
It would make every Indian proud that the sacred Piprahwa relics of Bhagwan Buddha have come home after 127 long years. These sacred relics highlight India’s close association with Bhagwan Buddha and his noble teachings. It also… pic.twitter.com/RP8puMszbW
ఇది కూడా చదవండి:ధూమపానం దూల తీర్చిందట.. క్యాన్సర్‌తోపాటు ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్లే