Adani Grp:
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయర్క్‌లో అరెస్టు వారెంట్ జారీ అయింది. దీనిలో భాగంగానే గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనళ్లుడు సాగర్ సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు $265 మిలియన్ల లంచాలు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీననంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి.. నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు.
Also Read: కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య
అయితే ఇవన్నీ నిజం కావంటోంది అదానీ గ్రూప్. అమెరికా ప్రాసిక్యూటర్లు తమపై చేసిన ఆరోపణల్లో ఎక్కడా నిజం లేదని వాదిస్తోంది. చట్టాలకు లోబడే తమ గ్రూప్ నడుచుకుంటోందని...లావాదేవీలన్నీ కరెక్ట్‌గానే చేస్తున్నామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణలమీద తాము తప్పకుండా స్పందిస్తామని...న్యాయపరంగా ముందు వెళతామని చెప్పింది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందన్నారు అదాని గ్రూప్‌కు చెదిన ప్రతినిధి. పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందన్నారు. తాము చాలా దేశాల్లో ప్రాజెక్టులను నడుపుతున్నామని...న్ని చోట్లా వీటిని పాటిస్తూ వస్తున్నామన్నారు. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూపు ఓ ప్రకటనలో చెప్పింది.
Also Read: అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు..
Also Read: పెళ్ళికి ముందు IFFI 2024 వేడుకలో అక్కినేని కపుల్స్
Also Read: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన!