ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన! స్టేజ్-1 కి ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు స్టేజ్-2 దేహదారుఢ్య పరీక్షల గడువు తేదీని నవంబర్ 28 వరకు పెంచుతున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవాలని తెలిపింది. By Kusuma 21 Nov 2024 in జాబ్స్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఫిజికల్ టెస్ట్‌లకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్టేజ్ 2 దేహదారుఢ్య పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచుతున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన వారు నవంబర్ 28వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి https://slprb.ap.gov.in/ అప్లై చేసుకోవాలి. ఇందులో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే వివరాల కోసం ఈ 9441450639, 9100203323 నంబర్లకు సంప్రదించవచ్చు. ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..? డిసెంబర్‌కి పూర్తి చేయాలని.. గత ప్రభుత్వం వైసీపీ 2022లో పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి మొదటి ఫేజ్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. దీనికి సెలక్ట్ అయిన వారికి ఫిజికల్ టెస్ట్‌లను ఈ డిసెంబర్ చివరి వారంలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా? పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను 2023 జనవరి 22న నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేశారు. మొత్తం 95,208 మంది అభ్యర్థులు ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారు. వీరికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించడానికి తేదీ ఖరారు చేశారు. ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! 2023 మార్చి 13 నుంచి 20 వరకు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. కానీ పరీక్షలు నిర్వహించలేదు. అదే సమయంలో రాష్ట్రంలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీల నియోజకవర్గ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ పరీక్షలను అప్పటి ప్రభుత్వం వాయిదా వేసింది. ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! #apslprb #Police Recruitment #ap-police-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి