పెళ్ళికి ముందు IFFI 2024 వేడుకలో అక్కినేని కపుల్స్ 55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2024) వేడుక గోవా వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య తన కాబోయే భార్య శోభితతో కలిసి రెడ్ కార్పెట్ పై మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update naga Chaitanya- sobhita షేర్ చేయండి IFFI 2024: 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ఉత్సవాలు ఈ నెల నవంబర్ 20 నుంచి 28వరకు గోవా వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. అయితే ఈ వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు సందడి చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య తన కాబోయే భార్య శోభిత దూళిపాళ్ళతో కలిసి రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. శోభిత క్లాసిక్ ఇండియన్ వస్త్రాలంకారణలో కనిపించగా.. చైతన్య గ్రే షూట్ లో ధరించారు. వీరితో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, అమల కూడా IFFI2024 ఉత్సవానికి హాజరయ్యారు. Also Read : కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య బాలీవుడ్ సెలెబ్రెటీలు బాలీవుడ్ సెలెబ్రెటీలు సన్యా మల్హోత్రా, భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ, బొమన్ ఇరానీ, రణదీప్ హుడా, సన్నీ కౌశల్, ప్రసూన్ జోష్రా, సుధీర్ జోష్రా, రకుల్ తదితరులు IFFI 2024 ఉత్సవంలో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే.. చైతన్య, శోభిత ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే నెల డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్థూడియోస్ లో తెలుగు సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనుంది. తాజాగా వీరి పెళ్లి కార్డు కూడా నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7 2025 విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ సూపర్ హిట్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో నాగచైతన్య జంటగా సాయి పల్లవి నటిస్తోంది. View this post on Instagram A post shared by HT City (@htcity) Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! #IFFI Goa 2024 #sobhita-dhulipala #naga-chaitanya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి