/rtv/media/media_files/2025/12/30/social-media-2025-12-30-19-24-31.jpg)
Act on obscene, unlawful content or face consequences, Cental warning warning to online platforms
సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించింది.
Also Read: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై సోషల్ మీడియాలు కఠినంగా చర్యలు తీసుకోవడం లేదని ఐటీశాఖ ఆరోపించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం థర్డ్‌పార్టీ సమాచారాన్ని ఆయా వేదికల్లో అప్‌లోడ్, ప్రచురణ లేదా వ్యాప్తి చేస్తే దీనికి సోషల్ మీడియా సంస్థలతో పాటు ఆయా ప్రచూరణ ప్లాట్‌ఫామ్‌లదే బాధ్యత అని వార్నింగ్ ఇచ్చింది. రూల్స్ పాటించకుంటే ఐటీ యాక్ట్, BNSతో పాటు ఇతర చట్టాల కింద సంబంధింత సంస్థలు, కస్టమర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.
Also Read: పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు.. తమకు సంబంధం లేదంటున్న ఉక్రెయిన్
Follow Us